Manchu Vishnu: ఎవరో ఐటెం రాజా చేస్తున్న పని.. నేను అలా అనలేదు..

Manchu Vishnu: గత కొంతకాలంగా మంచు విష్ణు పేరు సోషల్ మీడియాలో ఏదో ఒక రకంగా వినిపిస్తూనే ఉంది.

Arun Chilukuri
Published on: 15 Oct 2022 2:53 PM IST
Manchu Vishnu Clarity On Prabhas Adipurush Controversy
X

Manchu Vishnu: ఎవరో ఐటెం రాజా చేస్తున్న పని.. నేను అలా అనలేదు..

Manchu Vishnu: గత కొంతకాలంగా మంచు విష్ణు పేరు సోషల్ మీడియాలో ఏదో ఒక రకంగా వినిపిస్తూనే ఉంది. మా ఎన్నికల సమయం నుంచి మంచు విష్ణు ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు తన వివాదాస్పద ఇంటర్వ్యూలతోనో లేక కామెంట్లతోనూ వార్తల్లోకి ఎక్కుతున్న మంచు విష్ణు తాజాగా యంగ్ రెబల్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న "ఆది పురుష్" చిత్ర టీజర్ గురించి కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. "ఆది పురుష్" టీజర్ చూసి మోసపోయినట్టు ఫీల్ అయ్యా అని, సినిమాలో విజువల్స్ చాలా కార్టూనిష్ గా ఉన్నాయి అని, అల ఉన్నప్పుడు దర్శక నిర్మాతలు ముందుగానే ప్రేక్షకులను ప్రిపేర్ చేయాలి అని మంచు విష్ణు అన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే తాజాగా ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదు అంటూ మంచి విష్ణు సోషల్ మీడియా ద్వారా చెప్పుకు వచ్చారు. "ఫేక్ న్యూస్. అనుకున్నట్టుగానే నా జిన్నా సినిమా విడుదలకి ముందు ఎవరో ఒక ఐటెం రాజా ఇలా నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నాడు. నా డార్లింగ్ బ్రదర్ ప్రభాస్ కి ఎప్పుడు మంచి జరగాలని నేను కోరుకుంటాను," అని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు మంచి విష్ణు. ఇక మంచు విష్ణు హీరోగా పాయల్ రాజ్ పుత్ మరియు సన్నీ లియోని హీరోయిన్లుగా నటిస్తున్న జిన్నా సినిమా త్వరలోనే విడుదల కి సిద్ధమవుతోంది. ఈశాన్ సూర్య ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story