Manchu Vishnu: మాట మీద నిలబడని మంచు విష్ణు

Manchu Vishnu: మాట మీద నిలబడని మంచు విష్ణు

admin1
Published on: 7 March 2022 3:21 PM IST
Manchu Vishnu Broke the Promise | Telugu Online News
X

Manchu Vishnu: మాట మీద నిలబడని మంచు విష్ణు

Manchu Vishnu: "ఆర్ఎక్స్ 100" వంటి సూపర్ హిట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయిన పాయల్ రాజ్ పుత్ ఆ తరువాత వెంకటేష్ సరసన" వెంకీ మామ", రవితేజ సరసన "డిస్కో రాజా" సినిమా లో కనిపించింది. ఈ మధ్యనే "కిరాతక" అనే ఒక సినిమాని సైన్ చేసింది పాయల్ రాజ్ పుత్. ఆది సాయికుమార్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు మంచు క్యాంపు లో చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే మంచు విష్ణు హీరోగా ఒక కొత్త సినిమా మొదలైంది. నాగేశ్వరరావు అనే పాత్రలో మంచు విష్ణు కనిపించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ మొత్తం తిరుపతిలోనే జరగనుంది.

ఈ నేపథ్యంలో తిరుపతికి పయనమవుతోంది పాయల్ రాజ్ పుత్. మంచు విష్ణు సరసన నటించడం పాయల్ రాజ్ పుత్ కి ఇదే మొదటిసారి. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇంతకుముందు విష్ణు తన సినిమాల్లో కేవలం లోకల్ హీరోయిన్లకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. మా ఎన్నికల సమయంలో పరభాషా హీరోయిన్ల కటే తెలుగు హీరోయిన్ల కి మాత్రమే ప్రాధాన్యత ఇస్తానని ప్రమాణం చేసిన విష్ణు ఇప్పుడు మాత్రం తన సినిమాకి పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా తీసుకోవడంతో అభిమానులు మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో మాత్రం బోలెడు కబుర్లు చెప్పి ఇప్పుడు మాత్రం వేరే హీరోయిన్లను ఛాన్స్ ఇస్తున్నారు అని విష్ణును ఇప్పుడు అందరూ ట్రోల్ చేస్తున్నారు.

admin1

admin1

Next Story