MAA Elections: మేనిఫెస్టో విడుదల చేసిన మంచు విష్ణు ప్యానెల్

MAA Elections: 'మా' ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడడంతో మంచు విష్ణు ప్యానెల్ మేనిఫెస్టో విడుదల చేసింది.

Arun Chilukuri
Updated on: 7 Oct 2021 9:00 PM IST
Manchu Vishnu Announces his Manifesto for MAA Elections
X

MAA Elections: మేనిఫెస్టో విడుదల చేసిన మంచు విష్ణు ప్యానెల్

MAA Elections: 'మా' ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడడంతో మంచు విష్ణు ప్యానెల్ మేనిఫెస్టో విడుదల చేసింది. ఈ సందర్భంగా విష్ణు తన మేనిఫెస్టోలో కీలక ప్రకటనలు చేశారు. తన సొంత డబ్బుతో 'మా'కు బిల్డింగ్ కడతానని మరోసారి తేల్చి చెప్పారు. ఇప్పటికే భవనం కోసం మూడు స్థలాలను పరిశీలించామన్నారు. అలాగే, డైరెక్టర్లు, నిర్మాతలు, రచయితలు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌లకోసం ఓ యాప్ సిద్ధం చేసినట్లు చెప్పారు. ఇదే సమయంలో 'మా' సభ్యులందరికీ ఫ్రీ హెల్త్ స్కీమ్ ప్రకటించారు. దీనితో పాటు ఆర్ధికంగా వెనుకపడిన సభ్యులకు ఇళ్లు కట్టిస్తామన్నారు.

మంచు విష్ణు ప్యానెల్‌ విడుదల చేసిన మ్యానిఫెస్టోలోని ముఖ్యాంశాలు

ఒక యాప్ క్రియేట్ చెసి దాని సహకారంతో అందరికి అవకాశాలు ఇప్పిస్తాం

అర్హులైన సభ్యులకు సొంత ఇళ్లు

మా సభ్యుల పిల్లల విద్యకు ఆర్థిక చేయూత

సొంత డబ్బులతో 'మా'భవనం

ప్రతీ ఒక్కరికి ఫ్రీ హెల్త్

మహిళల రక్షణకి హై పవర్ కమిటీ

'మా'సభ్యుల పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్‌

కల్యాణలక్ష్మీ తరహాలో రూ.1.16 లక్షలు

అర్హులైన సభ్యులకు పెన్షన్లు

'మా'సభ్యత్వ ఫీజు రూ.75 వేలకు తగ్గింపు

'మా'సభ్యుల కోసం జాబ్‌ కమిటీ ఏర్పాటు

Arun Chilukuri

Arun Chilukuri

Next Story