మళ్లీ ఈ లక్ష్మీ ప్రసన్నే నాకు కూతురుగా పుట్టాలి : మోహన్ బాబు!

మళ్లీ ఈ లక్ష్మీ ప్రసన్నే నాకు కూతురుగా పుట్టాలి : మోహన్ బాబు!
x
Highlights

HBD Manchu Lakshmi Prasanna : నటుడుగా, నిర్మాతగా టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మంచు మోహన్ బాబు.. అయన వారసత్వాన్ని అంది పుచ్చుకుని బుల్లితెర పైన, వెండితెర పైన రాణిస్తుంది మంచు లక్ష్మి ప్రసన్న.

HBD Manchu Lakshmi Prasanna : నటుడుగా, నిర్మాతగా టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మంచు మోహన్ బాబు.. అయన వారసత్వాన్ని అంది పుచ్చుకుని బుల్లితెర పైన, వెండితెర పైన రాణిస్తుంది మంచు లక్ష్మి ప్రసన్న.. నేడు ఆమె 43 వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.. ఈ సందర్భంగా ఆమె తండ్రి మోహన్ బాబు ఎమోషనల్ ట్వీట్ చేశారు. "నా ముద్దుల కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న వైఢ్యూర్య పుష్య గోమేదిక మరకత మాణిక్యం లాంటి కుమార్తె పుట్టినరోజు ఈరోజు. మరొక జన్మంటూ ఉంటుందో లేదో తెలీదు గానీ ఉంటే మళ్లీ ఈ లక్ష్మీ ప్రసన్నే నాకు కూతురుగా పుట్టాలని, నేను తనకు తండ్రిగా పుట్టాలని ఆ పంచభూతాల్ని ప్రార్ధిస్తున్నాను, వ్యాపీ బర్త్‌ డేటు మై డియర్‌ లన్లీ లక్ష్మి మంచు" అంటూ ట్వీట్ చేశారు మోహన్ బాబు!

అటు మంచు లక్ష్మికి సినీ తారలు, అభిమానుల నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సిద్ధార్త్ హీరోగా నటించిన 'అనగనగా ఓ ధీరుడు' చిత్రంతో నటిగా ఇండస్ట్రీకి పరిచయమైంది మంచు లక్ష్మి... ఈ సినిమాకి గాను ఆమెకి నంది పురస్కారం లభించడం విశేషం.. ఆ తరువాత 'గుండెల్లో గోదారి', 'చందమామ కథలు', 'దొంగాట', ఊకొడతారా ఉలిక్కిపడతారా, లక్ష్మి బాంబ్ వంటి చిత్రాలలో విభిన్నమైన పాత్రలను పోషించి ఆకట్టుకుంది. ఇక మంచు లక్ష్మి పేరు పైన ఆమె తండ్రి మోహన్ బాబు సినీ నిర్మాణ సంస్థను ప్రారంభించి పలుసినిమాలని నిర్మించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories