Adipurush: వారి కోసం 2500 ఆదిపురుష్ టిక్కెట్స్ బుక్ చేస్తోన్న మంచు మనోజ్ దంపతులు..

Adipurush: డార్లింగ్ ప్రభాస్ నుంచి వస్తున్న మరో పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్.

Arun Chilukuri
Updated on: 13 Jun 2023 1:00 PM IST
Manchu Manoj To Book 2500 Tickets Of Adipurush Film For Orphan Kids
X

Adipurush: వారి కోసం 2500 ఆదిపురుష్ టిక్కెట్స్ బుక్ చేస్తోన్న మంచు మనోజ్ దంపతులు..

Adipurush: డార్లింగ్ ప్రభాస్ నుంచి వస్తున్న మరో పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్. రామాయణం ఇతిహాసంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్..కళ్లు చెదిరే గ్రాఫిక్స్ తో భారీ బడ్జెట్ తో ఆది పురుష్ సినిమాని రూపొందించారు. ఇక రిలీజ్ అయిన రెండు ట్రైలర్స్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. సాంగ్స్‌కు కూడా భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

ఈ చిత్రాన్ని నిరు పేదలకు, అనాథలకు ఉచితంగా చూపించాలని చాలా మంది ప్రముఖులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆ సినిమా టిక్కెట్లను కొనుగోలు చేసి ప్రత్యేక షోలు వేయించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నిరుపేద పిల్లల కోసం 10వేల టికెట్లను బుక్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ కూడా పదివేల టికెట్లు బుక్ చేసి పేదలకు పంచుతామని తెలిపారు. ఈ ఉద్దేశంతోనే బాలీవుడ్ సింగర్ అనన్య బిర్లా కూడా పదివేల టికెట్లు బుక్ చేసుకున్నారు.

శ్రేయాస్ మీడియా ఖమ్మం జిల్లాలోని 1103 గ్రామాలలో ఒక్కో రామాలయానికి 101 టికెట్లు బుక్ చేస్తున్నట్లు తెలిపింది. తాజాగా మంచు మనోజ్ కూడా చేరారు. ఆయన 2500 టిక్కెట్స్‌ను బుక్ చేసి రెండు రాష్ట్రాల్లో ఉన్న అనాథ పిల్లలకు చూపించనున్నారట. దీనికి సంబంధించి ఓ ప్రకటన విడుదలైంది. ఈ కార్యక్రమంలో మనోజ్‌తో పాటు ఆయన భార్య భూమ మౌనిక కూడా పాల్గోంటుందని తెలిపారు మనోజ్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story