Manchu Manoj: మంచు మనోజ్ రెండో పెళ్ళికి డేట్ ఫిక్స్..?

Manchu Manoj: మంచు మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు మనోజ్ హీరోగా తనకంటూ ఒక మంచి పేరు తెచ్చుకున్నారు.

Arun Chilukuri
Published on: 17 Dec 2022 3:33 PM IST
Manchu Manoj Second Marriage Date Locked
X

Manchu Manoj: మంచు మనోజ్ రెండో పెళ్ళికి డేట్ ఫిక్స్..?

Manchu Manoj: మంచు మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు మనోజ్ హీరోగా తనకంటూ ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే గత కొద్ది కాలంగా సినిమాలకి దూరంగా ఉంటున్న మంచు మనోజ్ తాజాగా ఇప్పుడు రెండవసారి పెళ్లి చేసుకోబోతూ వార్తల్లోకి ఎక్కారు. 2015లో మంచు మనోజ్ ప్రణతి రెడ్డి అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ కొన్ని మనస్పర్ధలు రావడంతో వీళ్ళిద్దరూ విడిపోయారు. జాబ్ పరంగా ప్రణతి అమెరికాకి వెళ్ళిపోయింది. కానీ మంచు మనోజ్ మాత్రం భారతదేశం వదిలి వెళ్లాలని అనుకోలేదు.

ఈ నేపథ్యంలోనే వీరి మధ్య గొడవలు వచ్చినట్లు తెలుస్తోంది. 2019లోనే తాము విడాకులు తీసుకుంటున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు మనోజ్. అయితే కొద్ది రోజులుగా మంచు మనోజ్ త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.

లేట్ టీడీపీ లీడర్ భూమా నాగిరెడ్డి రెండవ కూతురు భూమా మౌనికని మంచు మనోజ్ పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా మంచి మనోజ్ మరియు భూమా మౌనిక ప్రేమించుకుంటున్నారని వార్తలు పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు వీరిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారట. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన మంచు మనోజ్ మౌనిక మెడలో తాళికట్టబోతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది. మరి ఇప్పటికైనా మంచు మనోజ్ తన రెండవ పెళ్లి గురించి క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story