Top
logo

గొప్ప మనసు చాటుకున్న మంచు మనోజ్!

గొప్ప మనసు చాటుకున్న మంచు మనోజ్!
X
Highlights

ఇక వివరాల్లోకి వెళ్తే.. బోన్‌ కేన్సర్‌ బాధపడుతున్న ఓ బాబుకి చికిత్స అందించలేని స్థితిలో కుటుంబ సభ్యులు ఉండడంతో సహాయం కోసం సోనూసూద్ కి ఓ వీడియోని ట్వీట్ చేశారు.

టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. బోన్‌ కేన్సర్‌ తో బాధపడుతున్న ఓ బాబుకు అండగా నిలిచాడు మనోజ్. ఇక వివరాల్లోకి వెళ్తే.. బోన్‌ కేన్సర్‌ బాధపడుతున్న ఓ బాబుకి చికిత్స అందించలేని స్థితిలో కుటుంబ సభ్యులు ఉండడంతో సహాయం కోసం సోనూసూద్ కి ఓ వీడియోని ట్వీట్ చేశారు. ఈ వీడియోలో బాబు తండ్రి మనోహర్ మాట్లాడుతూ.. తాను ఓ ఆటో డ్రైవర్‌నని, తన బిడ్డకు చికిత్స అందించేందుకు తన దగ్గర డబ్బులు లేవని, సహాయం చేసేందుకు ఎవరైనా ముందుకు రావాలంటూ కనీళ్లు పెట్టుకున్నాడు.

అయితే ఈ వీడియోని చూసి చలించిపోయిన మనోజ్ ఆ బాబుకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. "దయచేసి నా ఇన్‌బాక్స్‌కి అన్ని వివరాలు పంపండి. ఆసుపత్రి పేరు, వైద్యుల పేర్లు కూడా పంపండి. ధైర్యంగా ఉండండి. ఆ బాలుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను" అని మనోజ్ రీట్వీట్ చేశాడు. మనోజ్ స్పందించడం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనోజ్ ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

ఇక అటు సినిమాలకి చాలా గ్యాప్ తీసుకున్న మనోజ్ ప్రస్తుతం అహం బ్రహ్మాస్మి అనే సినిమాలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా ద్వారా శ్రీకాంత్ ఎన్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ఎంఎం ఆర్ట్స్ అనే ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించి మనోజే సొంతంగా సినిమాని నిర్మిస్తున్నారు. మనోజ్ సరసన ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు , తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం బాషలలో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు.


Web TitleManchu Manoj helps to a poor boy for suffering bone cancer
Next Story