డాక్ట‌ర్ బాబు ఏడ్చాడు.. మా అమ్మ హ్యాపీ- మంచు ల‌క్ష్మి ట్వీట్

Manchu Lakshmi twrrt On Karthika Deepam
x

మంచు ల‌క్ష్మి

Highlights

Manchu Lakshmi: టాలీవుడ్ న‌టి మంచు ల‌క్ష్మీ సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటారో అంద‌రికి తెలిసిందే.

Manchu Lakshmi: టాలీవుడ్ న‌టి మంచు ల‌క్ష్మీ సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటారో అంద‌రికి తెలిసిందే. ఇటీవ‌ల సౌత్ ఇండియాన్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ కాంత్ తో్ ఫోటో దిగి సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మ‌రో ఆస‌క్తిక‌ర ట్వీట్ చేసింది. మంచు ల‌క్ష్మీ ట్వీట్ సోష‌ల్ మీడియాలో చ‌క్కర్లు కొడుతుంది. ఇంత‌కి మంచు ల‌క్ష్మీ ట్వీట్ చేసింది కార్తీ దీపం సిరీయ‌ల్ పైన‌.. ఇందులో డాక్ట‌ర్ బాబు కార్తీక్ ఏడ్చాడు అట.. ఎట్ట‌కేల‌కు మా అమ్మ హ్యాపీగా ఫీలైంది' అంటూ సినీ న‌టి మంచు ల‌క్ష్మి చేసిన ట్వీట్ వైర‌ల్ అవుతోంది.

నెటిజ‌న్లు డాక్ట‌ర్ బాబు క‌న్నీరు పెట్టుకోవ‌డంపై సెటైర్లు వేస్తున్నారు. స్టార్ మాలో ప్ర‌సార‌మ‌య్యే ఈ సూప‌ర్ డూప‌ర్ హిట్ సీరియ‌ల్ గురించే మ‌హిళ‌లంతా చ‌ర్చించుకుంటున్నార‌ని కామెంట్లు చేస్తున్నారు. బుల్లితెర బిగ్గెస్ట్ హిట్ సీరియ‌ల్ కార్తీక దీపం. మాటీవిలో ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ తెలుగు వారిని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఇందులో కార్తీక్(ప‌రిటాల నిరుప‌మ్) డాక్ట‌ర్ బాబుగా ఆయ‌న న‌టన అద‌ర‌హో అనిపిస్తోంది. ఇందులో దీప వంట‌ల‌క్క ఆమె పాత్ర గురించి ప్ర‌త్యేకంగా చెప్పే అవ‌స‌రం లేదు.

ఈ సీరియల్ క‌థ ఏంటంటే దీప అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని అనుమానంతో వదిలేస్తాడు డాక్టర్ బాబు. ఆమెకు పుట్టిన కవలలు చివ‌ర‌కు తల్లిదండ్రులను ఎలా కలిపారనే నేపథ్యంతో ఈ సీరియ‌ల్ తీస్తున్నారు. తాజా ఎపిసోడ్‌లో డాక్ట‌ర్ బాబుకు అస‌లు నిజం తెలుస్తుంది. దీంతో ఎన్న‌డూ లేని విధంగా క‌న్నీరు పెట్టాడు. మొద‌టి సారి డాక్ట‌ర్ బాబు క‌న్నీరు పెట్టుకోవ‌డంతో సామాజిక మాధ్య‌మాల్లో ఇందుకు సంబంధించిన ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. బుల్లితెర‌పై సంచ‌ల‌నం సృష్టిస్తున్న ఈ సీరియల్ చివ‌రి ద‌శ‌కు వ‌చ్చిన‌ట్లు అనిపిస్తుంది. సామాన్యులే కాదు సెల‌బ్రిటీలు కూడా ఈ సీరియ‌ల్ ను ఎంత ఇష్టప‌డుతున్నారో అర్థ‌మ‌వుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories