Manchu Lakshmi: జీవితంలో సరిదిద్దుకోలేని తప్పులు చేశాను..
Lakshmi Manchu: కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కూతురిగా మంచు లక్ష్మి ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Manchu Lakshmi: జీవితంలో సరిదిద్దుకోలేని తప్పులు చేశాను..
Lakshmi Manchu: కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కూతురిగా మంచు లక్ష్మి ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గా, నటిగా, నిర్మాతగా, హోస్ట్ గా కూడా కెరియర్లో బాగానే ముందుకెళుతున్న లక్ష్మి సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన సినిమాల గురించి వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పడానికి మంచు లక్ష్మి మోహన్ బాబు లాగానే ఎప్పుడూ వెనకాడదు.
తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్ లో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. "నా జీవితంలో నేను కొన్ని తప్పులు చేశాను. అవి నేను మార్చలేను" అని మంచు లక్ష్మి సోషల్ మీడియా ద్వారా చెప్పటం అభిమానుల సైతం షాక్ కి గురిచేస్తుంది. "నేను నా జీవితంలో కొన్ని తప్పులు చేశాను. నేను వాటిని మార్చలేను. కానీ వాటి వల్ల నేను చాలానే మారాను. కాబట్టి నేను అదే తప్పులు మళ్ళీ చేయను," అంటూ మంచు లక్ష్మి ఇంస్టాగ్రామ్ లో స్టోరీలో రాసుకొచ్చింది.
ఇంతకీ ఈమె చేసిన తప్పులు ఏంటి అనేది మాత్రం చెప్పలేదు. ఏదేమైనా మంచు లక్ష్మి సడన్ గా ఇలాంటి పోస్ట్ పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ఈ మధ్యనే "పిట్టకథలు" అని ఒక అథాలజీలో కనిపించిన మంచు లక్ష్మి ఇప్పుడు "మాన్స్టర్" అనే సినిమాతో మలయాళం లో కూడా పరిచయమైంది. గత కొద్ది రోజులుగా సినిమాలకి కొంచెం దూరంగానే ఉంటున్న మంచు లక్ష్మి ఇప్పుడు ఆహా లోని "చెఫ్ మంత్ర" లో హోస్ట్ గా కనిపిస్తోంది.




