PSPK28: పవర్‌స్టార్‌ సినిమాలో నటించడం లేదు: మానస రాధాకృష్ణన్

PSPK28: హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Venkata Chari
Published on: 13 Jun 2021 4:54 PM IST
Manasa Ramachandra Speaks About Pawan Kalyan New Movie
X

మలయాళ నటి మానస రాధాకృష్ణన్ (ఫొటో ట్విట్టర్)

PSPK28: హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరి కాంబోలో మరోసారి బాక్సాఫీస్ ను బద్దలు కొట్టేందుకు కథను పకడ్బందీగా తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. పీఎస్‌పీకే28 గా ప్రస్తుతం పిలుస్తోన్న ఈ సినిమాలో నటించే హీరోయిన్లపై రోజుకో రూమర్ వస్తుంది. వీటిపై నిర్మాతలు అధికారికంగా స్పందించినా రూమర్లు మాత్రం ఆగడంలేదు. తాజాగా ఓ మలయాళ నటి పవన్‌కు జోడీగా నటిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

మలయాళ నటి మానస రాధాకృష్ణన్ #PSPK28లో నటిస్తుందని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కాగా, ఈ వార్తలపై హీరోయిన్‌ మానస రాధాకృష్ణన్‌ వివరణ ఇచ్చింది. పవన్ కల్యాణ్‌ సినిమాలో నేను నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్తో నిజం లేదు. ఈ వార్తలు నమ్మవద్దని పేర్కొంది. అలాగే ఈ వార్తలపై చిత్ర యూనిట్‌ కూడా స్పందించింది. ఇలాంటి పుకార్లను నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయమైనా.. మేం అధికారికంగా వెల్లడిస్తామని తెలిపింది.

మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యర్నేని, వై.రవిశంకర్‌ లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నాడు.


Venkata Chari

Venkata Chari

Next Story