చిరంజీవి సినిమాలో ‘సౌమ్య’ గుర్తుందా? సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్న కుర్రాళ్ళు.. ఎవరంటే?

చిరంజీవి సినిమాలో ‘సౌమ్య’ గుర్తుందా? సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్న కుర్రాళ్ళు.. ఎవరంటే?
x
Highlights

Mana Shankara Vara Prasad Garu: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం థియేటర్ల వద్ద ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే.

Mana Shankara Vara Prasad Garu: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం థియేటర్ల వద్ద ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా విడుదలై దాదాపు రూ. 350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం, ఫిబ్రవరి 11 నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ సినిమాలో శంకర వర ప్రసాద్ పాత్ర చిరంజీవి తన జీవితానికి దగ్గరగా ఉండే ఒక సీరియల్ గురించి చెబుతూ ఉంటారు. సినిమా ఆద్యంతం ఫన్నీగా సాగే ఈ సీరియల్ ట్రాక్‌లో హీరోయిన్‌గా నటించిన ‘సౌమ్య’ పాత్రకు ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ పాత్రలో మెరిసిన నటి కోసం నెటిజన్లు వెదుకులాట మొదలుపెట్టారు.

ఎవరీ సాయి ప్రియా రెడ్డి?

సీరియల్‌లో సౌమ్యగా నటించిన ఆమె పేరు సాయి ప్రియా రెడ్డి. ఈమె ఇండస్ట్రీకి కొత్తేమీ కాదు. చిన్నప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయి ప్రియా.. క్షేత్రం, నందీశ్వరుడు, పూలరంగడు, రెబెల్, మిర్చి, తడాఖా, జీనియస్, లక్కీ వంటి పెద్ద చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా గ్యాప్ వచ్చిన తర్వాత యూట్యూబ్ వెబ్ సిరీస్‌ల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇటీవల విశ్వక్ సేన్ నటించిన 'లైలా' సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో మెరిసి అందరినీ ఆకట్టుకుంది.

మెగాస్టార్ సినిమాలో కీలకమైన ఫన్నీ ట్రాక్‌లో కనిపించడంతో సాయి ప్రియా రెడ్డికి ఇప్పుడు టాలీవుడ్‌లో ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఆమె పలు క్రేజీ ప్రాజెక్టుల్లో భాగస్వామి అయినట్లు సమాచారం. మెగాస్టార్ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో ఈ బ్యూటీ త్వరలోనే వెండితెరపై మరింత బిజీ కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories