Mamta Mohandas: మెగా కాంపౌండ్ నుంచి మమతా మోహన్‌దాస్‌కు పిలుపు

Mamta Mohandas: టాలీవుడ్‌లో మమతా మోహన్‌దాస్ ఎక్కువ సినిమాలు చేయకపోయినా.. బాగానే పేరు సంపాందిందింది.

Venkata Chari
Updated on: 10 May 2021 8:45 PM IST
Mamta Mohandas gets a call from mega compound
X

మమతా మోహన్‌దాస్‌ (ఫొటో ట్విట్టర్)

Mamta Mohandas: టాలీవుడ్‌లో మమతా మోహన్‌దాస్ ఎక్కువ సినిమాలు చేయకపోయినా.. బాగానే పేరు సంపాందిందింది. యమదొంగ, కేడీ లాంటి చిత్రాల్లో అతిథి పాత్రల్లో నటించి మెప్పించిన ఈ నటి, ఆ తరువాత సినిమాలకు దూరంగా ఉంటోంది. అయితే, ఈ మధ్యలో క్యాన్సర్ కు గురై, కోలుకున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం మమతా మోహన్‌దాస్ త్రిభాషా చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో మమతా మోహన్‌దాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా మమతా మోహన్‌దాస్‌కు మెగా కాంపౌండ్ నుంచి పిలుపు వచ్చిందంట. మెగాస్టార్ చిరంజీవి రాబోయే మూవీలో మమతా మోహన్‌దాస్ ను ప్రత్యేక పాత్రలో నటించేందుకు సంప్రదించినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు.

మరోవైపు, 'శంకర్ దాదా జిందాబాద్' సినిమాలో 'అకలెస్తే అన్నం పెడతా' పాటలో చిరంజీవితో పాటు చిందులేసింది ఈ నటి. చాలాకాలం తరువాత వీరిద్దరిని మళ్లీ సిల్వర్ స్క్రీన్‌లో చూసేందుకు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Venkata Chari

Venkata Chari

Next Story