Mammootty: మలయాళ సూపర్ స్టార్ ఇంట విషాదం..!

Mammootty: మలయాళ సీనియర్ నటుడు మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్(93) తుదిశ్వాస విడిచారు.

Arun Chilukuri
Published on: 21 April 2023 12:59 PM IST
Mammoottys Mother Fatima Ismail Passes Away
X

Mammootty: మలయాళ సూపర్ స్టార్ ఇంట విషాదం..!

Mammootty: మలయాళ సీనియర్ నటుడు మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్(93) తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య కారణాలతో గత కొంతకాలంగా చికిత్స పొందుతున్న ఫాతిమా ఇస్మాయిల్ కొచ్చిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలను వైకోమ్ లోని చెంబులోని జుమా మసీదులో నిర్వహించనున్నారు.

ఫాతిమా ఇస్మాయిల్ కు మమ్ముట్టితో పాటు కొడుకు ఇబ్రహీం కుట్టి, కుమార్తెలు అమీనా, సౌదా, షఫీనా ఉన్నారు. మమ్ముట్టి తల్లి అకాల మరణంతో మలయాళ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె మరణం పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సోషల్ మీడియా పోస్ట్ లో సంతాపం తెలిపారు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story