Mammootty: మెగా నిర్మాత కి షాకిచ్చిన మమ్ముట్టి

Mammootty: ఆ పాత్ర కి చిరంజీవిని అడగగలవా అంటూ కౌంటరేసిన మమ్ముట్టి

admin1
Updated on: 31 Dec 2021 7:10 PM IST
Mammootty Gives Strong Counter Allu Aravind | Tollywood News
X

 మెగా నిర్మాత కి షాకిచ్చిన మమ్ముట్టి

Mammootty: ఈ మధ్యకాలంలో పరభాషా నటులు తెలుగులో లో విలన్ పాత్రలు చేయడానికి బాగానే ఆసక్తి చూపిస్తున్నారు. అలా అనుకునే టాలీవుడ్ స్టార్ నిర్మాత అల్లు అరవింద్ మలయాళం స్టార్ ను సినిమాలో విలన్ పాత్ర కోసం అడిగారట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన జల్సా సినిమాలో ముకేష్ రుషి పోషించిన పాత్రకోసం ముందుగా మలయాళం స్టార్ యాక్టర్ మమ్ముట్టిని అనుకున్నారట. కానీ ఈ సినిమా కోసం అడుగగా ఆ స్టార్ నటుడు అల్లు అరవింద్ కి షాకింగ్ రెస్పాన్స్ ఇచ్చారట. ఆ స్టార్ నటుడు మరెవరో కాదు మమ్ముట్టి.

ఈ విషయాన్ని స్వయంగా నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో చెప్పారు అల్లు అరవింద్. "పదేళ్ల క్రితం మమ్ముట్టి గారికి కాల్ చేశాను. సార్ మా సినిమాలో ఒక మంచి పాత్ర ఉంది మీరు చేయాలి అన్నాను. 'ఏం క్యారెక్టర్' అని అడిగారు. పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్నాడు, అందులో మంచి విలన్ పాత్ర అని చెప్పాను. 'ఆహా అట్లాగా ఈ పాత్రని చిరంజీవిని వేయమని నువ్వు అడగగలవా?' అని ప్రశ్నించారు. నేను అడగనండి అని చెప్పాను. 'మరి నన్ను ఎందుకు అడుగుతున్నావ్' అని ఆయన అడిగారు. సారీ సార్ అని ఫోన్ పెట్టేసాను," అని చెప్పుకొచ్చారు అల్లు అరవింద్.

admin1

admin1

Next Story