Lalbagh Movie: "లాల్ బాగ్" మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

Mamatha Mohandas Come Back Tollywood Lalbagh Movie
x

lalbagh Movie First look Relase:(Twitter)

Highlights

Lalbagh Movie: యమదొంగ ఫేమ్ మమతా మోహన్ దాస్ నటించిన "లాల్ బాగ్" మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది.

lalbagh Movie: యమదొంగ ఫేమ్ మమతా మోహన్ దాస్ నటించిన "లాల్ బాగ్" మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. మలయాళం సినిమా 'లాల్ బాగ్'. ఐటి బ్యాక్ డ్రాప్‌లో సాగే థ్రిల్లర్ జానర్‌లో రాబోతోన్న ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో అనువదిస్తున్నారు. సంపత్ కుమార్ సమర్పణలో సెలెబ్స్ అండ్ రెడ్ కార్పెట్ బ్యానర్ పై రాజ్ జకారియా నిర్మిస్తోన్న ఈ మూవీ తెలుగు టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

యమదొంగ,చింత‌కాయ‌ల ర‌వి, కింగ్ చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది క‌న్న‌డ భామ మ‌మ‌తామోహ‌న్ దాస్. అయితే క్యాన్సర్‌ రావడంతో కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరమైన ఈ భామ..ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీ కానుంది. సుధీర్ఘ విరామం తర్వాత లాల్‌బాగ్‌ అనే ఓ తెలుగు చిత్రంలో నటిస్తోంది. ప్ర‌శాంత్ ముర‌ళి ప‌ద్మానాభ‌న్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఐటీ, థ్రిల్ల‌ర్ బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో సాగుతున్న ఈ మూవీ పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. ఇందులో నందినీరాయ్‌, సిజోయ్ వ‌ర్గిస్‌, అజిత్ కోషి కీ రోల్స్ పోషిస్తున్నారు. రాహుల్‌ రాజ్‌ ఈ సినిమాకు సంగీతం అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories