Malli Pelli: బయోపిక్ కా బాప్.. నరేష్-పవిత్ర మళ్లీ పెళ్లి..!

Malli Pelli: నరేష్-పవిత్ర..టాలీవుడ్ లో వీళ్లిద్దరే ఈమధ్య కాలంలో బాగా వైరల్ అయ్యారు.

Arun Chilukuri
Updated on: 21 April 2023 5:01 PM IST
Malli Pelli Telugu Teaser Review
X

Malli Pelli: బయోపిక్ కా బాప్.. నరేష్-పవిత్ర మళ్లీ పెళ్లి..!

Malli Pelli: నరేష్-పవిత్ర..టాలీవుడ్ లో వీళ్లిద్దరే ఈమధ్య కాలంలో బాగా వైరల్ అయ్యారు. ఓ సినిమాలో కలిసి నటించిన వీరు అనంతరం చెట్టాపట్టాలేసుకొని తిరగడం, నరేష్ మూడో భార్య గొడవ పడడం, పవిత్ర, నరేష్ ఓ హోటల్ లో ఉండగా నరేష్ మూడో భార్య అక్కడకు రావడం...ఈ రచ్చ అంతా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది. 2023 న్యూ ఇయర్ సందర్భంగా త్వరలో పెళ్లి చేసుకుంటామని పవిత్ర, నరేష్ ప్రకటన ఇవ్వడం, లిప్ కిస్ వీడియోని షేర్ చేయడం ఆ తర్వాత పెళ్లి వీడియోని రిలీజ్ చేయడం..ఇలా ఒకదాని తర్వాత ఒకటి వీరు చేసిన ప్రతి పని సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యి కూర్చుంది.

టాలీవుడ్ లో సెన్సేషన్ అయిన నరేష్-పవిత్ర జంట ఆ తర్వాత మళ్లీ పెళ్లి అంటూ సినిమాని అనౌన్స్ చేశారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను లాంఛ్ చేశారు. దీన్ని చూస్తుంటే నరేష్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో చేసిన బయోపిక్ లా ఉంది. నరేష్, అతని భార్య రమ్యల మధ్య పవిత్ర ఎలా వచ్చింది..అసలు రమ్య ఈ విషయంలో ఎలా ఫీలవుతుంది. రమ్య ఆరోపణలపై నరేష్ ఎలా రియాక్ట్ అయ్యాడు. ఇలాంటి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తోనే మళ్లీ పెళ్లి తెరకెక్కినట్లు ఉంది. సినిమాలో ఆర్టిస్టుల పేర్లు కూడా ఒరిజినల్ నేమ్స్ పెట్టడంతో టీజర్ చాలా రియలిస్టిక్ గా ఉంది. పవిత్ర, నరేష్ ఇద్దరు హోటల్ లో దొరికిన ఎపిసోడ్ కూడా టీజర్ లో చూపించారు.

మళ్లీ పెళ్లి టీజర్ ఆకట్టుకునే విధంగా ఉంది. నరేష్ వైఫ్ పాత్రను నటుడు విజయ్ కుమార్ తనయ వనిత విజయ్ కుమార్ పోషించారు. ఈ సినిమాను నిర్మాత ఎంఎస్. రాజు తెరకెక్కిస్తే నరేష్ సొంతంగా నిర్మించాడు. మే నెలలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story