Eesha Rebba: తెలుగు హీరోయిన్‌కు మలయాళి ట్యూటర్

Malayalam tutor for Telugu heroine
x

ఈషా రెబ్బా

Highlights

Eesha Rebba: తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా.. బాక్సాఫీస్ వద్ద సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ప్రతిభావంతులైన నటీమణుల్లో ఒకరు.

Eesha Rebba: తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా.. బాక్సాఫీస్ వద్ద సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ప్రతిభావంతులైన నటీమణుల్లో ఒకరు. తాజాగా, ఈ నటి మలయాళంలో అడుగుపెట్టింది. ఫెల్లిని దర్శకత్వంలో ఒట్టు అనే రాబోయే చిత్రంతో మలయాళంలో అరంగేట్రం చేస్తుంది. మలయాళ, తమిళ భాషలలో విడుదల కానున్న ద్విభాషా చిత్రం. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ కుంచాకో బోబన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

అలాగే ఈ చిత్రంలో రెండున్నర దశాబ్దాల తరువాత కోలీవుడ్ సీనియర్ నటుడు అరవింద్ స్వామి జాయిన్ కానున్నారు. దీంతో ఈషా రెబ్బా తన మలయాళ తొలి చిత్రంపై సూపర్ ఎగ్జైట్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో తను మాట్లాడింది. ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతుందని వివరించింది. షూటింగ్ ప్రారంభించేలోపే భాష నేర్చుకోవడానికి మలయాళ ట్యూటర్‌ను నియమించాలని చూస్తున్నట్లు పేర్కొంది. ఏదేమైనా ఈ సినిమా అయిన తన కెరీర్ లో పెద్ద హిట్ కొట్టి, మరిన్న ఆఫర్లు రావాలని కోరుకుందాం.

Show Full Article
Print Article
Next Story
More Stories