Mammootty: సంక్రాంతి రోజే క‌రోనా బారిన ప‌డ్డ మ‌మ్ముట్టి

Mammootty: కరోనా విజృంభణ కొనసాగుతోంది. మాయదారి మహమ్మారి ఎవరిని వదలడం లేదు.

Arun Chilukuri
Published on: 16 Jan 2022 9:33 PM IST
Malayalam Superstar Mammootty Tests Positive for Coronavirus
X

Mammootty: సంక్రాంతి రోజే క‌రోనా బారిన ప‌డ్డ మ‌మ్ముట్టి

Mammootty: కరోనా విజృంభణ కొనసాగుతోంది. మాయదారి మహమ్మారి ఎవరిని వదలడం లేదు. కేసులు పెరుగుతుండటంతో సినిమా షూటింగ్ లు మాని సినీ తారలు ఇంటి వద్దే ఉంటున్నారు. ఇప్పటి వరకు చాలామంది యాక్టర్స్ కోవిడ్ బారిన పడ్డారు. తాజాగా మరో స్టార్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టి కి కోవిడ్ సోకింది.

ఈ విషయాన్ని ఆయన ట్వీట్టర్ వేదికగా వెల్లడించారు. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ .. కోవిడ్ పాజిటివ్ వచ్చిందని అన్నారు. కొంచం జ్వరంతో ఉన్నానని... వైద్యుల సూచనల మేరకు ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలిపారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎల్లవేళలా మాస్క్ ధరించండి, జాగ్రత్తగా ఉండండని మమ్ముట్టి సూచించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story