#RC15: రామ్ చరణ్ సినిమాలో విలన్ గా కనిపించనున్న మలయాళం స్టార్ నటుడు

Ram Charan's - #RC15: #ఆర్సీ15 అని పిలవబడుతున్న ఈ సినిమా ఒక పొలిటికల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

admin1
Updated on: 30 Aug 2021 7:19 AM IST
Malayalam Star Actor Jayaram going to Play Villain Role in Ram Charans Next Movie | Tollywood News Today
X

రామ్ చరణ్ సినిమాలో విలన్ గా కనిపించనున్న మలయాళం స్టార్ నటుడు

Ram Charan's - #RC15: ప్రస్తుతం "ఆర్ఆర్ఆర్" సినిమాతో బిజీగా ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా పూర్తయిన తర్వాత శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. #ఆర్సీ15 అని పిలవబడుతున్న ఈ సినిమా ఒక పొలిటికల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా అక్టోబర్ నుంచి షూటింగ్ సెట్స్ పైకి వెళ్లనుంది. కియార అద్వానీ ఈ సినిమా లో హీరోయిన్గా నటిస్తోంది. "వినయ విధేయ రామ" సినిమా తర్వాత కియారా అద్వానీ - రామ్ చరణ్ కాంబినేషన్లో రాబోతున్న రెండవ సినిమా ఇది. తమన్నా మరియు అంజలి కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించనున్నారు.

తాజా సమాచారం ప్రకారం మలయాళంలో పాప్యులర్ నటుడైనా జయరామ్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. జాతీయ అవార్డ్ సైతం అందుకున్న జయరామ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. అనుష్క నటించిన "భాగమతి", అల్లు అర్జున్ హీరోగా నటించిన "అల వైకుంఠ పురములో" సినిమాలలో కీలక పాత్రలు పోషించిన జయరామ్, రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో మెయిన్ విలన్ గా కనిపించనున్నారు. ఇక ఈ సినిమాతో పాటు జయ రామ్ కళ్యాణ్ రామ్ "ఓం 3డి", ప్రభాస్ "రాధేశ్యామ్" మరియు మహేష్ బాబు "సర్కారు వారి పాట" సినిమాలతో కూడా బిజీగా ఉన్నారు.

admin1

admin1

Next Story