మలయాళం సినిమా 'నాయట్టు' రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్న అల్లు అర్జున్

Malayalam Movie Nayattu Remake Rights Owned By Allu Arjun
x

'నాయట్టు' రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్న అల్లు అర్జున్

Highlights

Nayattu Remake - Allu Arjun: ఈ మధ్య స్టార్ హీరోల కన్ను మలయాళ సినిమాలపై పడినట్టు అనిపిస్తోంది. ఒక వైపు పవన్ కళ్యాణ్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమా...

Nayattu Remake - Allu Arjun: ఈ మధ్య స్టార్ హీరోల కన్ను మలయాళ సినిమాలపై పడినట్టు అనిపిస్తోంది. ఒక వైపు పవన్ కళ్యాణ్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమా రీమేక్ చేస్తుండగా మరోవైపు చిరంజీవి లూసిఫర్ సినిమా ను రీమేక్ చేస్తున్నారు. తాజాగా మరో మెగాహీరో ఈ జాబితాలో చేరనున్నారు. ఆయన మరెవరో కాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ హోమ్ ప్రొడక్షన్ అయిన గీతా ఆర్ట్స్ ఈ మధ్యనే సూపర్ హిట్ అయిన మలయాళం మలయాళం సినిమా 'నాయట్టు' రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్నారు. చిత్ర దర్శకుడు మార్టిన్ ప్రక్కట్ ఈ విషయాన్ని స్వయంగా తెలియజేశారు.

అయితే తెలుగులో ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహించనున్నారు అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.అయితే ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే కాక తమిళం మరియు హిందీ భాషలలో కూడా రీమేక్ కాబోతోంది. హిందీలో జాన్ అబ్రహం ఈ సినిమాను రీమేక్ చేస్తుండగా మరోవైపు స్టార్ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ ఈ సినిమా రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. కుంచకో కోబన్, జోజు జార్జ్, నిమిషా తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా హత్య కేసులో ఇరుక్కున్న ముగ్గురు పోలీసులు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆద్యంతం ఆసక్తికరంగా నడిచే ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories