Nayattu Movie Remake: పూర్తిగా అటకెక్కిన మలయాళం సినిమా రీమేక్

* అర్ధంతరంగా ఆగిపోయిన మలయాళం సినిమా రీమేక్

admin1
Published on: 16 Dec 2021 1:35 PM IST
Malayalam Movie Nayattu Remake is Stopped Due to Remake Rights Issue Between Producers
X

పూర్తిగా అటకెక్కిన నాయట్టు మలయాళం సినిమా రీమేక్ 

Nayattu Movie Remake: ఈ మధ్య టాలీవుడ్ లో మలయాళ సినిమాల హవా బాగా నడుస్తోంది. ఒకదాని తర్వాత మరొకటి సూపర్ హిట్ మలయాళ సినిమాలను తెలుగులో రీమేక్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అందులో "నాయట్టు" కూడా ఒకటి. కుంచకో బోబన్, జోజు జార్జ్, నిమిష సాజయన్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. గీత ఆర్ట్స్ బ్యానర్ ఈ చిత్రం రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికే కరుణ కుమార్ ని ఈ చిత్ర దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు నిర్మాతలు. రావు రమేష్, అంజలి వంటి తారాగణాన్ని కూడా ఎంపిక చేశారు నిర్మాతలు.

ఈ మధ్యనే క్లాప్ కొట్టి ఈ సినిమాని అధికారికంగా ప్రారంభించారు. కానీ షూటింగ్ మొదలవుతుంది అనగా అనుకోని విధంగా సినిమా కి బ్రేక్ పడింది. రీమేక్ రైట్స్ విషయంలో గీతా ఆర్ట్స్ మరియు మలయాళ నిర్మాతల కి మధ్య బేధాభిప్రాయాలు రావటమే దీనికి కారణం. దీంతో "నాయట్టు" సినిమా రీమేక్ ని నిర్మాతలు పక్కన పెట్టేశారట. కరుణ కుమార్ కూడా సినిమాలో నుంచి బయటకు వచ్చేశారు అని తెలుస్తోంది. అయితే ఇప్పుడు రీమేక్ రైట్స్ పై ఒక స్పష్టత వచ్చినప్పటికీ భవిష్యత్తులో కూడా ఈ సినిమా మొదలయ్యే అవకాశాలు లేనట్టు కనిపిస్తోంది. ఈ సినిమా చేయడానికి గీత ఆర్ట్స్ వారి ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. ఒకవేళ రీమేక్ రైట్స్ వేరే నిర్మాతలకి వెళితే అప్పుడు సినిమా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

admin1

admin1

Next Story