Samyuktha Menon: డానియల్ శేఖర్ కు జోడిగా మలయాళీ భామ

* భీమ్లా నాయక్ చిత్రంలో రానా సరసన మలయాళం హీరోయిన్

admin1
Published on: 31 Oct 2021 5:31 PM IST
Malayalam Actress Samyuktha Menon Joins Team Bheemla Nayak
X

డానియల్ శేఖర్ కు జోడిగా మలయాళీ భామ

Samyuktha Menon: ఈ మధ్యనే "వకీల్ సాబ్" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఇప్పుడు మలయాళంలో సూపర్ హిట్టయిన "అయ్యప్పనుం కోషియిం" అనే సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. రానా కూడా హీరోగా నటిస్తున్న ఈ సినిమా "భీమ్లా నాయక్" అనే టైటిల్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు సాగర్ కే చంద్ర. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో నిత్యమీనన్ కనిపించబోతున్నారు. అయితే రానా సరసన హీరోయిన్ ముందు ఐశ్వర్య రాజేష్ ని అనుకున్నారు కానీ ఆమె డేట్లు కుదరకపోవడంతో మరొక హీరోయిన్ వెతికే పనిలో పడ్డారు దర్శకనిర్మాతలు.

తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు రానా కోసం ఒక మలయాళం బ్యూటీని రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. మలయాళంలో నటిగా మంచి పేరు తెచ్చుకున్న సంయుక్త మీనన్ ఈ సినిమాలో రానా భార్య పాత్రలో కనిపించబోతోంది. ఈ విషయాన్ని చిత్రబృందం స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. "భీమ్లా నాయక్ ఫ్యామిలీ కి స్వాగతం" అంటూ సంయుక్త మీనన్ ను ఘనంగా ఆహ్వానించారు దర్శక నిర్మాతలు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

admin1

admin1

Next Story