ప్రముఖ నటి కేవీ శాంతి ఇకలేరు

ప్రముఖ మలయాళ నటి కేవీ శాంతి మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఓ ఆసుపత్రిలో..

Raj
By Raj
Published on: 23 Sept 2020 10:21 AM IST
ప్రముఖ నటి కేవీ శాంతి ఇకలేరు
X

ప్రముఖ మలయాళ నటి కేవీ శాంతి మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమె వయసు 81 సంవత్సరాలు. ఆమెకు కుమారుడు శ్యామ్ కుమార్ ఉన్నారు. ఆమె కొట్టాయం లోని ఎత్తూమనూర్ లో జన్మించారు. చిన్న వయస్సులోనే చెన్నైకి వచ్చారు. సినిమాల్లో నటించడమే కాకుండా, నర్తకిగా ఆమెకు మంచి పేరుంది.

ఉదయ్ శంకర్ సెంటర్ ఫర్ డాన్స్ కు ప్రధాన నృత్యకారిణిగా ఎంపికయ్యారు. ఆ తరువాత కేవీ శాంతి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ప్రదర్శనలు ఇచ్చారు. ఆమె మలయాళంలో 50 కి పైగా చిత్రాలలో, తమిళం, తెలుగు, కన్నడ మరియు హిందీ భాషలలో మరికొన్ని చిత్రాలలో నటించారు. 1953 లో విడుదలైన పదాత పెయిన్కిలి చిత్రంలో నటిగా శాంతి అరంగేట్రం చేశారు. ఆమె చివరిసారిగా 1975 లో సిల్వర్ స్క్రీన్ మీద కనిపించారు. శాంతి మృతిపట్ల పలువురు దర్శకులు, నటీనటుల సంతాపం తెలిపారు.

Raj

Raj

Next Story