NTR30: ఎన్టీఆర్ కోసం రంగంలోకి మళ‍‍‍‍యాళ మెగాస్టార్?

NTR30: జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే.

Venkata Chari
Published on: 18 May 2021 5:08 PM IST
Malayalam Actor Mammootty Play a Lead Role in NTR and Koratala Shiva Movie
X

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ (ఫొటో ట్విట్టర్)

NTR30: జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. వీరి కాంబోలో ఇంతకు ముందు వచ్చిన 'జనతా గ్యారేజ్' సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనే హైలైట్‌గా నిలిచింది. మరోసారి బంపర్ హిట్ కొట్టేందుకు కొరటాల సూపర్ స్కెచ్ వేశాడని గుసగుసలు వినబడుతున్నాయి.

#NTR30 వర్కింగ్ టైటిల్‌ గా రానున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళం మెగాస్టార్ మమ్ముట్టీ ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈమేరకు కొరటాల మమ్ముట్టిని రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలుస్తోంది.

కాగా, కొరటాల శివ గత చిత్రాల్లో ఇతర ఇండస్ట్రీలకు చెందిన స్టార్లను కీలక పాత్రలతో బరిలోకి దించుతున్నాడు. ఓ సారి ఆయన గత చిత్రాలను పరిశీలిస్తే.. 'మిర్చి' మూవీ కోసం సత్యరాజ్‌ను తీసుకున్నారు. 'జనతా గ్యారేజ్' సినిమా కోసం మోహన్ లాల్‌ రంగంలోకి దించగా.. 'భరత్ అనే నేను' చిత్రంలో శరత్ కుమార్ తో కీలక పాత్ర పోషించేలా చేశారు. అలాగే మెగాస్టార్ హీరోగా తీస్తున్న 'ఆచార్య' సినిమా కోసం బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తాను ఓ కీలకమైన పాత్ర కోసం నటింపజేస్తున్నాడు.

తాజాగా NTR‌30లో మళయాల స్టార్ మమ్ముట్టీని ఓ కీలక పాత్ర కోసం ఫిక్స్ చేసినట్లు టాక్. మమ్ముట్టి కొంతకాలం క్రితం 'యాత్ర' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. త్వరలోనే అధికారిక సమాచారం బయటకు రానున్నట్లు తెలుస్తోంది.

Venkata Chari

Venkata Chari

Next Story