logo

బన్నీ త్రివిక్రమ్ సినిమాలో మలయాళం నటుడు

బన్నీ త్రివిక్రమ్ సినిమాలో మలయాళం నటుడు
Highlights

'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా తో డిజాస్టర్ అందుకున్న టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్...

'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా తో డిజాస్టర్ అందుకున్న టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ మధ్యనే లాంచ్ అయ్యింది. ఈ సినిమాలో టబు ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాలో ఒక ప్రముఖ మలయాళ నటుడు ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేరళలో కూడా అల్లు అర్జున్ కి ఈ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ అందరూ బన్నీని మల్లు అర్జున్ గా పిలుస్తూ ఉంటారు.

ఈ నేపథ్యంలో మలయాళ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించేందుకు ఈ సినిమాలో వందకు పైగా మలయాళం సినిమాలు చేసిన జయరామ్ ను ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 'డీజే' లో బన్నీ తో రొమాన్స్ చేసిన పూజ హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కోసం 'అలకనంద' అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ మరియు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.


లైవ్ టీవి


Share it
Top