శ్రీకాంత్ షూటింగ్ మధ్యలో నుంచి వెళ్ళిపోయారు అని చెబుతున్న మాళవిక

Malavika: సీనియర్ హీరోయిన్ మాళవిక గురించి తెలియని వారు ఉండరు.

admin1
Updated on: 4 Feb 2022 2:42 PM IST
Malavika saying that Srikanth has gone from the middle of the shooting
X

శ్రీకాంత్ షూటింగ్ మధ్యలో నుంచి వెళ్ళిపోయారు అని చెబుతున్న మాళవిక

Malavika: సీనియర్ హీరోయిన్ మాళవిక గురించి తెలియని వారు ఉండరు. "చాలా బాగుంది" సినిమా తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె ఆ తర్వాత నవ్వుతూబ్రతకాలిరా, దీవించండి, శుభకార్యం, ప్రియ నేస్తమా, అప్పారావు డ్రైవింగ్ స్కూల్ వంటి సినిమాల్లో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. చంద్రముఖి సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించిన మాళవిక ఇప్పటిదాకా 35 సినిమాలు చేసింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయింది. చాలా కాలం తర్వాత మళ్ళీ ఆలీతో సరదాగా షో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తన మొదటి సినిమా అనుభవం గురించి చెబుతూ "చాలా బాగుంది" సినిమా షూటింగ్ సమయంలో శ్రీకాంత్ తన మీద కోపంతో షూటింగ్ మధ్యలో ఉంచి వెళ్ళిపోయాడు అని, ఒక రొమాంటిక్ పాట షూటింగ్ జరుగుతున్నప్పుడు తాను కొంచెం ఇబ్బంది పడ్డానని అంత కంఫర్టబుల్గా లేదని చెప్పడంతో శ్రీకాంత్ కి కోపం వచ్చి మధ్యలో నుంచి వెళ్లిపోయారని ఇన్ డైరక్ట్ గా చెప్పింది మాళవిక. ఈవీవీ తో పని చేయడం చాలా బాగా అనిపించింది అని కానీ రేప్ సీన్ మాత్రం కొంచెం డిస్టర్బింగ్ గా ఉందని తన పాత్రకి నెగటివ్ షేడ్స్ ఉండడంతో ఉండడంతో కొంచెం ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చింది మాళవిక.

admin1

admin1

Next Story