'పెళ్లిసందడి'కి హీరోయిన్ ఫిక్స్..

పెళ్లిసందడికి హీరోయిన్ ఫిక్స్..
x
Highlights

శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ తారాగణంతో దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించిన 'పెళ్లి సందడి' చిత్రం ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్ కొట్టింది

శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ తారాగణంతో దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించిన 'పెళ్లి సందడి' చిత్రం ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్ కొట్టింది. ముఖ్యంగా ఈ సినిమాకి కీరవాణి అందించిన పాటలు బాగా ప్లస్ అయ్యాయి.. ఈ సినిమా శ్రీకాంత్ కి మంచి ఇమేజ్ ని తీసుకువచ్చింది. అయితే ఇప్పుడు ఇదే టైటిల్ తో తాజాగా తన కొత్త సినిమాని అనౌన్స్ చేశారు రాఘవేంద్రరావు..

అయితే తాజాగా ఈ సినిమాలో హీరోగా శ్రీకాంత్ కొడుకు రోషన్ ని ఎంపిక చేశారు మేకర్స్.. ఇక హీరోయిన్ గా మాళవిక నాయర్ ని ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. ముందుగా కొత్త అమ్మాయిని తీసుకుందాం అనుకున్నప్పటికీ ఫైనల్ గా మాళవికని ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక మాళవిక నాయర్ ఎవడే సుబ్రమణ్యం సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయమైంది. కళ్యాణ వైభోగమే, టాక్సీవాలా సినిమాలతో ఆకట్టుకుంది ఈ భామ.. ఇక తాజాగా ఒరేయ్ బుజ్జిగా సినిమాతో ప్రేక్షకులను అలరించింది.

ఇక ఈ సినిమాని ఆర్.కె ఫిలిం అసిసియేషన్ బ్యానర్, ఆర్కా మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తుండగా, చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నారు. అటు దాదాపుగా మూడేళ్ళ తర్వాత రాఘవేంద్రరావు నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమా పైన మంచి అంచనాలు నెలకొన్నాయి. రాఘవేంద్రరావు చివరిగా అక్కినేని నాగార్జున హీరోగా ఓం నమో వెంక‌టేశాయ అనే భక్తీరస చిత్రాన్ని తెరకెక్కించారు. 2017లో వచ్చిన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఆ తర్వాత మళ్ళీ అయన సినిమాలను చేయలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories