Malavika Mohanan:ప్రభాస్ పై మాళవిక మోహనన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Malavika Mohanans Interesting Comments On Prabhas
x

ప్రభాస్ పై మాళవిక మోహనన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Highlights

కేరళ కుట్టి మాళవిక మోహనన్.. సూపర్ స్టార్ రజినీకాంత్‌ వేట మూవీతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Malavika Mohanan: కేరళ కుట్టి మాళవిక మోహనన్.. సూపర్ స్టార్ రజినీకాంత్‌ వేట మూవీతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు మాళవిక. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో రాజాసాబ్ సినిమాలో కూడా నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ గురించి, ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవిక మోహనన్. బాహుబలి మూవీ నుంచి ప్రభాస్‌కి తాను పెద్ద ఫ్యాన్‌ అని.. ఆయనతో కలిసి నటించాలని ఎన్నో కలలు కన్నానని చెప్పారు. మొత్తానికి రాజాసాబ్ మూవీతో తన కల నెరవేరిందని చెప్పుకొచ్చారు. ఇక ప్రభాస్ గురించి చెబుతూ.. సెట్‌లో ప్రభాస్‌ని చూసి ఆశ్చర్యపోయా. అంత పెద్ద స్టార్ అయినా చాలా నార్మల్‌గా ఉంటారని.. బాగా సపోర్ట్ చేస్తారని అన్నారు. ఆయన చుట్టూ ఉన్న వారితో ఎంతో సరదాగా ఉంటూ ఆ ప్రదేశాన్నంతా కంఫర్టబుల్‌గా మార్చేస్తారని చెప్పారు. ముఖ్యంగా సెట్‌లో ఉన్న టీమ్ మొత్తానికి మంచి ఫుడ్‌ పంపిస్తారు. దగ్గరుండి బిర్యాని తినిపిస్తారు.. మంచి కామెండీ టైమింగ్‌తో నవ్విస్తారు అని అన్నారు. నిజంగా ప్రభాస్ చాలా స్వీట్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు మాళవిక మోహనన్.

ఇక తను ఈ చిత్రాన్ని చేయడానికి గల కారణాన్ని తెలియజేశారు. రాజాసాబ్ సినిమాలో తన పాత్ర చాలా ముఖ్యమైందని చెప్పారు. సాధారణంగా స్టార్ హీరోల చిత్రాల్లో హీరోయిన్‌కు స్క్రీన్ టైమ్ తక్కువ ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. కానీ రాజాసాబ్ లో మాత్రం తన రోల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుందని అందుకే ఆ పాత్ర చేస్తున్నట్టు తెలిపారు. కామెడీ, హారర్ జోనర్‌లో మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీపై భారీ హైప్ ఉంది. ఈ సినిమా 2025 దసరాకు విడుదల కానుంది. మరి ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఇక మాళవిక మోహనన్ సినిమాల విషయానికొస్తే.. రజనీకాంత్ వేట సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టిన మాళవిక.. తర్వాత తన రెండో సినిమాగా దళపతి విజయ్‌తో నటించే ఛాన్స్ కొట్టేశారు. మాస్టర్ మూవీతో లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో చారు పాత్రలో నటించి ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో అడుగు పెట్టిన మాళవిక.. యుద్ధం వంటి అనేక సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తంగలాన్ చిత్రంలో ఆదివాసి మహిళ ఆరతి పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకున్నారు.

ప్రస్తుతం ఈ బ్యూటీ ఫుల్ బిజీగా ఉన్నారు. కోలీవుడ్‌లో కార్తీ సర్దార్ సినిమాలో నటిస్తున్నారు. మిత్రన్ మూవీలో కీలక పాత్రలో కనిపించనున్నారు. మోహన్ లాల్ తో మరో సినిమా చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories