Pushpa: స్పెషల్ సాంగ్ ప్లాన్ లో పుష్ప టీం

Pushpa: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన రాబోయే సినిమా 'పుష్ప' ని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నాడు.

Venkata Chari
Updated on: 13 May 2021 9:16 PM IST
Makers to add an Item song in Pushpa first part
X

అల్లు అర్జున్ (పోటో ట్విట్టర్)

Pushpa: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన రాబోయే సినిమా 'పుష్ప' ని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ హై బడ్జెట్ పాన్-ఇండియన్ యాక్షన్ ఎంటర్టైనర్ పై అంచనాలు హై రేంజ్‌లో ఉన్నాయి.

సినిమా మొదటి భాగం షూటింగ్ ఇప్పటికే దాదాపుగా పూర్తయింది. కొన్ని సన్నివేశాలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయంట. ప్రస్తుతం ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా మొదటి భాగంలో ఐటమ్ సాంగ్‌ చేర్చుతున్నట్లు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారంట. కానీ, బన్నీ చిందులేసే స్పెషల్ సాంగ్ లేడీ ఇంకా ఖరారు కాలేదంట.

మరోవైపు, మొదటి భాగం విడుదలైన కొద్దిరోజులకే రెండో భాగం కూడా థియేటర్లలోకి వస్తుందని మేకర్స్ స్పష్టం చేశారు. సినిమా ఫలితం గురించి మేకర్స్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారంట. అల్లు అర్జున్ ఈ చిత్రంలో మునుపెన్నడూ చూడని విధంగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందాన్న హీరోయిన్‌ గా నటిస్తోంది.

Venkata Chari

Venkata Chari

Next Story