Ghani Movie: వరుణ్ తేజ్ గని సినిమాకు హాలీవుడ్ స్టంట్ మాస్టర్

Ghani Movie: స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా కానిపించనున్నాడు

Kranthi
Published on: 27 May 2021 12:02 PM IST
Makers of Varun Tej Ghani Movie Hire Hollywood Stunt Choreographers
X

Varun Tej's Ghani: (File Image)

Ghani Movie: మెగా వారసుడు వరుణ్ తేజ్ గని సినిమా కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. వరుస హిట్ల తర్వాత ఒక యాక్షన్ మూవీని.. అది కూడా బాక్సింగ్ బేస్ స్టోరీ మీద చేస్తుండటంతో సినిమాకు క్రేజ్ బాగా వచ్చింది. సినిమా పేరు కూడా పవన్ కళ్యాణ్ బాలు సినిమాలోని కేరెక్టర్ పేరు కావడంతో.. మెగా ఫ్యాన్స్ ఇంకా సంబరపడిపోతున్నారు. మరోవైపు పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండతో తీస్తున్న సినిమా కూడా బాక్సింగ్ బేస్ స్టోరీ కావడంతో.. కాంపిటీషనల్ క్రేజ్ కూడా పెరిగింది. ఇప్పుడా సినిమాకు హాలీవుడ్ నుంచి స్టంట్ మాస్టర్ ని ప్రత్యేకంగా తీసుకొస్తున్నారనే వార్త ఫ్యాన్స్ కు కిర్రాకు పుట్టిస్తోంది.

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వరుణ్ తేజ్.. సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంటాడు. కథను నమ్మి సినిమాలు చేస్తుంటాడు. ఇటీవల హరీష్ శంకర్ తెరకెక్కించిన 'గద్దల కొండ గణేష్' సినిమాలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు వరుణ్.

పలు హాలీవుడ్ యాక్షన్ సినిమాలకు పనిచేసిన లార్నెల్ స్టోవల్ – లాడ్ రింబర్ నేతృత్వంలో ఈ యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేయనున్నారు. ఈ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన వరుణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ ఉపేంద్ర – బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి – విలక్షణ నటుడు జగపతిబాబు – నదియా – నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ జోడీగా సయీ మంజ్రేకర్ కనిపించనుంది.

ఇక గని విషయానికొస్తే.. యాక్షన్ తో పాటు ఎమోషన్ ఉన్న కథ ఇది. అల్లు బాబీ – సిద్ధు ముద్ద నిర్మిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. అందువలన వరుణ్ తేజ్ విదేశాలకు వెళ్లి మరీ బాక్సింగ్ లో శిక్షణ తీసుకుని వచ్చాడు. 'గని' కోసం ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో ఒక భారీ స్టేడియం సెట్ నిర్మిస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ఈ సెట్లో సినిమాకే హైలైట్ గా నిలవనున్న హై ఇంటెన్సిటీ బాక్సింగ్ ఎపిసోడ్ ని చిత్రీకరించనున్నారు.

Kranthi

Kranthi

Next Story