భారీ కలెక్షన్లతో బ్లాక్ బస్టర్ గా నిలిచిన మేజర్

Major Movie Box Office Collection Day 3
x

భారీ కలెక్షన్లతో బ్లాక్ బస్టర్ గా నిలిచిన మేజర్

Highlights

Major Movie Collections: అడవి శేష్ హీరోగా "గూఢచారి" ఫేమ్ డైరెక్టర్ శశికిరణ్ తిక్క దర్శకత్వంలో ఈ మధ్యనే విడుదలైన సినిమా "మేజర్".

Major Movie Collections: అడవి శేష్ హీరోగా "గూఢచారి" ఫేమ్ డైరెక్టర్ శశికిరణ్ తిక్క దర్శకత్వంలో ఈ మధ్యనే విడుదలైన సినిమా "మేజర్". 26/11 ఎటాక్ లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. సయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య జూన్ 3న థియేటర్లలో విడుదల అయింది. శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా ని సోనీ పిక్చర్స్ ఫిలిమ్స్ ఇండియా, జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్ మరియు ఏ ప్లస్ ఎస్ మూవీస్ వారు నిర్మించారు.

శ్రీ చరణ్ పాకల ఈ సినిమా కి సంగీతాన్ని అందించారు. విడుదలైన మొదటి రోజు నుంచే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో ముందుకు దూసుకు వెళుతోంది. ఇక ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 35.60 కోట్లకి కలెక్షన్లు చేరుకున్నాయి. మొదటి రోజున 13.40 కోట్లు అందుకున్న ఈ సినిమా 35.60 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో మొదటి వారాంతం ను పూర్తి చేసుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో నే కాక మిగతా దేశాల్లో కూడా ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను నమోదు చేసుకుంటోంది. అమెరికాలో ఇప్పటికే ఈ సినిమా 860 కే డాలర్లు కలెక్షన్లు నమోదుచేసుకుని మిలియన్ మార్క్ దిశగా దూసుకెళుతోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా విడుదలైన కొద్దిరోజుల్లోనే చాలావరకు ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ పాయింట్ ని చేరుకుంది. అడవి శేష్ కెరియర్ లోనే ఈ సినిమా అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Show Full Article
Print Article
Next Story
More Stories