Adivi Sesh: నా పుట్టినరోజు నాడే ఆమెకు పెళ్లి అయింది.. నేను అలా అనడంతో పవన్ కళ్యాణ్ షాక్ అయ్యారు..

"నన్ను చూసి పవన్ కళ్యాణ్ గారు అలా అనుకున్నారు" అంటున్న అడవి శేష్

Arun Chilukuri
Updated on: 20 Jun 2022 9:00 PM IST
Major Actor Adivi Sesh Reveals His Love Story
X

Adivi Sesh: నా పుట్టినరోజు నాడే ఆమెకు పెళ్లి అయింది.. నేను అలా అనడంతో పవన్ కళ్యాణ్ షాక్ అయ్యారు..

Adivi Sesh: ఒకప్పుడు చిరంజీవి, రవితేజ, శ్రీకాంత్, నాని వంటి వారు ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చి మంచి హీరోలుగా తమకంటూ ఒక స్థాయిని టాలీవుడ్లో ఏర్పరుచుకున్నారు. తాజాగా ఈ జాబితాలో చేరిన మరో యువ హీరో అడవి శేష్. తన సినిమాలకు తానే రైటర్ గా మారి క్షణం, గూడచారి, ఎవరు, వంటి సినిమాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. తాజాగా "మేజర్" సినిమాతో అడవిశేష్ తన ఖాతాలో మరో బ్లాక్బస్టర్ ని నమోదు చేసుకున్నారు.

అయితే ఈ చిత్ర ప్రమోషన్స్ లో మాట్లాడుతూ అడవిశేష్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. క్షణం కంటే ముందు అడవి శేష్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "పంజా" సినిమా లో విలన్ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే మేజర్ సినిమా కోసం ఎనభై నాలుగు కేజీలు ఉండే అడివి శేష్ 73 కేజీలకు వచ్చేశాడట. ఇక బాలీవుడ్ ఆర్టిస్ట్ లాగా ఉండటం తో విలన్ రోల్స్ చేస్తే బాగుంటుందని దిల్ రాజు అన్నారని చెప్పుకొచ్చారు అడవి శేష్.

"పంజా సినిమా షూటింగ్ సమయంలో నేను హిందీ ఆర్టిస్ట్ అని అనుకొని పవన్ కళ్యాణ్ గారు నన్ను పిలిచి హిందీ లో మాట్లాడారు. నేను తెలుగు వాడిని అని చెప్పడంతో ఆయన ఆశ్చర్యపోయారు. ఇప్పటికీ నేను ఒక బాలీవుడ్ ఆర్టిస్ట్ అని చాలా మంది అనుకుంటూ ఉంటారు" అని అన్నారు అడవి శేష్. ఇక ప్రేమ పెళ్లి పై తనకి ఇప్పుడు అంతగా ఆసక్తి లేదని, "గతంలో ఫారిన్ లో ఉండేటప్పుడు ఒక పంజాబీ అమ్మాయిని ప్రేమించాను కానీ నా పుట్టినరోజు నాడే ఆమె పెళ్లి అయిపోయింది" అంటూ చెప్పుకొచ్చారు అడివి శేష్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story