రేపే విడుదల కానున్న 'మజిలీ' సినిమా పాట

రేపే విడుదల కానున్న మజిలీ సినిమా పాట
x
Highlights

గతంలో టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత, నాగ చైతన్య కలిసి 'ఏ మాయ చేసావే', 'ఆటోనగర్ సూర్య', 'మనం' సినిమాలలో నటించినప్పటికీ పెళ్లయిన తర్వాత వారిద్దరూ కలిసి...

గతంలో టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత, నాగ చైతన్య కలిసి 'ఏ మాయ చేసావే', 'ఆటోనగర్ సూర్య', 'మనం' సినిమాలలో నటించినప్పటికీ పెళ్లయిన తర్వాత వారిద్దరూ కలిసి నటిస్తున్న మొట్టమొదటి చిత్రం కాబట్టి ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. 'నిన్ను కోరి' ఫేమ్ శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందింది. దివ్యంశ కౌశిక్ కూడా ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మూవీ యూనిట్ ఒక పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

తాజా సమాచారం ప్రకారం 'మజిలీ' సినిమాలోని 'ప్రియతమా ప్రియతమా' అనే పాట లిరికల్ వీడియో ను రేపు అనగా మార్చి 11వ తేదీన సాయంత్రం 4:59 గంటలకు విడుదల చేయనున్నారు. పాట టైటిల్ ను బట్టి ఈ పాట రొమాంటిక్ సాంగ్ అని కొందరు గెస్ చేస్తున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 9 న విడుదల కానుంది. గత కొంతకాలంగా డిజాస్టర్ లతో సతమతమవుతున్న నాగచైతన్యకు ఈ సినిమా మంచి హిట్ ఇస్తుందని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories