జోరందుకున్న 'మజిలీ' ప్రీ రిలీజ్ బిజినెస్

'ఏ మాయ చేసావే', 'మనం', 'ఆటోనగర్ సూర్య' సినిమాలో ఇప్పటికే కలిసి నటించిన నాగచైతన్య సమంత పెళ్లి అయిన తర్వాత...
'ఏ మాయ చేసావే', 'మనం', 'ఆటోనగర్ సూర్య' సినిమాలో ఇప్పటికే కలిసి నటించిన నాగచైతన్య సమంత పెళ్లి అయిన తర్వాత మొట్టమొదటి సారిగా మళ్లీ తెలుగు తెరపై కనిపించనున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జోరుగా సాగుతోంది. పాప్యులర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ జెమినీ టీవీ ఈ చిత్ర టెలివిషన్ రైట్స్ కోట్లు పెట్టి కొన్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ చిత్ర డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో 3.5 కోట్లకు సొంతం చేసుకుంది. అంతేకాక ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు హిందీ డబ్బింగ్ రైట్స్ తో బాగానే సంపాదిస్తున్న సంగతి తెలిసిందే. 'మజిలీ' సినిమా కూడా హిందీ డబ్బింగ్ రైట్స్ తో 4 కోట్ల ను సొంతం చేసుకుంది. మొత్తంగా కలిపి ఇప్పటికీ నిర్మాతలు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తో 12.5 కోట్లను సంపాదించారు. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే ఇంత సంపాదించిన ఈ సినిమా విడుదలైన తరువాత రికార్డులను బ్రేక్ చేస్తుంది అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 'నిన్ను కోరి' ఫేమ్ శివ నిర్మాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5వ తారీఖున విడుదల కానుంది.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
నిఖత్ జరీన్‌కు హైదరాబాద్ లో ఘన స్వాగతం
27 May 2022 4:00 PM GMTముగిసిన కేటీఆర్ దావోస్ టూర్.. తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు..
27 May 2022 3:45 PM GMTLPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTనారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMT