logo

జోరుగా సాగుతున్న మజిలీ ప్రీ రిలీజ్ బిజినెస్

జోరుగా సాగుతున్న మజిలీ ప్రీ రిలీజ్ బిజినెస్

నిజజీవితంలో కూడా పెళ్లి చేసుకున్న సమంత-నాగచైతన్య తెరపై కూడా భార్య భర్త లాగా త్వరలో 'మజిలీ' సినిమాలో కనిపించనున్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న మొట్టమొదటి చిత్రం కాబట్టి ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో దివ్యంక కౌశిక్ రెండో హీరోయిన్ పాత్రలో కనిపిస్తుంది. 'నిన్ను కోరి' ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్ మరియు ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ అందింది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 22 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ సాగించిందని వార్తలు బయటకు వస్తున్నాయి.

నైజాం లో 6కోట్లు, సీడెడ్ లో 2.50 కోట్లు, తూ.గో జిల్లా లో 1.44 కోట్లు, కృష్ణ లో 1.28 కోట్లు, గుంటూరు లో 162కోట్లు, ప.గో జిల్లా లో 1.12కోట్లు, నెల్లూరు లో 0.70కోట్ల వరకు బిజినెస్ సాగింది. ఏపీ-తెలంగాణ కలుపుకుని 16.64 కోట్లకు రైట్స్ అమ్ముడయ్యాయి. రెస్ట్ అఫ్ ఇండియా లో 1.50కోట్లు, గల్ఫ్ లో 1.98 కోట్ల వరకు బిజినెస్ పూర్తయిందని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 21.14కోట్ల వరకు బిజినెస్ చేసింది 'మజిలీ'. అమెరికాలో ఈ సినిమాని 150కి పైగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. చూస్తూ ఉంటే గత కొంతకాలంగా డిజాస్టర్ లతో సతమతమవుతున్న నాగచైతన్య కు ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందని తెలుస్తోంది.

లైవ్ టీవి

Share it
Top