రికార్డులు బ్రేక్ చేస్తున్న 'మజిలీ' సినిమా

రికార్డులు బ్రేక్ చేస్తున్న మజిలీ సినిమా
x
Highlights

పెళ్లయిన తర్వాత సమంతా, నాగచైతన్య కలిసి నటించిన మొట్ట మొదటి సినిమా కాబట్టి 'మజిలీ' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అనుకున్న విధంగానే...

పెళ్లయిన తర్వాత సమంతా, నాగచైతన్య కలిసి నటించిన మొట్ట మొదటి సినిమా కాబట్టి 'మజిలీ' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అనుకున్న విధంగానే ఏప్రిల్ 5న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి మంచి కలెక్షన్స్ ను నమోదు చేసుకుంటున్న 'మజిలీ' సినిమా తాజాగా అన్ని ఏరియాల్లోను బ్రేక్ ఈవెన్ పాయింట్ దాటేసి ప్రాఫిట్ లోకి వచ్చేసింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 21 కోట్లకు అమ్ముడైన సంగతి తెలిసిందే.

తాజాగా విడుదలైన ఐదవ రోజుకు 'మజిలీ' సినిమా ప్రపంచవ్యాప్తంగా 22 కోట్ల షేర్ సాధించింది. అంటే కేవలం ఐదు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పాయింట్ చేరింది అన్నమాట. త్వరలో 30 కోట్ల క్లబ్ లో చేరుతుందని చెప్పవచ్చు అదే జరిగితే నాగ చైతన్య కెరీర్ లో 30 కోట్ల క్లబ్బులో చేరిన మొట్టమొదటి సినిమాగా నిలుస్తుంది. తెలుగు రాష్ట్రంలోనే కాక ఓవర్సీస్ లో సైతం మంచి విజయాన్ని సాధించింది 'మజిలీ'. మొదటి వారాంతంలో $600 కె కలెక్ట్ చేసిన సినిమా వారాంతంలో కూడా అదే జోరు కనబరిస్తే కచ్చితంగా మిలియన్ డాలర్ సినిమా గా మారుతుందని చెప్పచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories