ఏ మాత్రం తగ్గని 'మజిలీ' హవా

ఏ మాత్రం తగ్గని మజిలీ హవా
x
Highlights

పెళ్ళి తర్వాత సమంతా, నాగచైతన్య కలిసి నటించిన మొదటి చిత్రం కావడంతో 'మజిలీ' సినిమాపై భారీ అంచనాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. 'నిన్ను కోరి' ఫేమ్ శివ...

పెళ్ళి తర్వాత సమంతా, నాగచైతన్య కలిసి నటించిన మొదటి చిత్రం కావడంతో 'మజిలీ' సినిమాపై భారీ అంచనాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. 'నిన్ను కోరి' ఫేమ్ శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ఏప్రిల్ 5 న విడుదల అయి సమ్మర్ లో మొట్టమొదటి హిట్ చిత్రంగా మారింది. మొదటి వారాంతంలో మాత్రమే కాక రెండవ వారంలో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లను నమోదు చేయడం గమనార్హం. విడుదలైన రెండవ ఆదివారం కూడా ఆంధ్ర, సీడెడ్ మరియు నిజాం లోని కొన్ని థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యాయి.

కృష్ణా జిల్లాలో రెండవ ఆదివారం నాడు ఈ చిత్రం 7.81 లక్షల వసూళ్లను నమోదు చేసింది. ఇక తాజాగా ఈ చిత్రం 50 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. విడుదల అయిన కొద్ది రోజుల్లోనే ఆ చిత్రం 28.6 కోట్ల షేర్ ను నమోదు చేసుకుంది. ఈ చిత్రం థియేట్రికల్ 22 కోట్లకు అమ్ముడవడంతో ఈ చిత్రం అన్ని ప్రాంతాల్లోనూ బ్రేక్ ఈవెన్ పాయింట్ ను చేరుకొని బయ్యర్లను సేఫ్ జోన్ లోకి తీసుకు వచ్చింది. నాగచైతన్య కెరీర్లోనే ఈ చిత్రం హైయెస్ట్ కలెక్షన్ లను నమోదు చేసుకుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ నిర్మించిన ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతాన్ని అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories