మే నుండి మొదలవనున్న మహేష్ సినిమా

మే నుండి మొదలవనున్న మహేష్ సినిమా
x
Highlights

ఈ మధ్యన 'భరత్ అనే నేను' సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి సినిమా దర్శకుడు సుకుమార్ తో చేయనున్న సంగతి...

ఈ మధ్యన 'భరత్ అనే నేను' సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి సినిమా దర్శకుడు సుకుమార్ తో చేయనున్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందు మహేష్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'వన్ నేనొక్కడినే' సినిమా డిజాస్టర్ అయినప్పటికీ సుకుమార్ ఈ మధ్యనే 'రంగస్థలం' తో బ్లాక్ బస్టర్ అండంతో మళ్లీ సుక్కు తో పని చేయడానికి మొగ్గు చూపాడు మహేష్. సుకుమార్ కూడా ఈ సారి మహేష్ కి కచ్చితంగా ఒక హిట్ ఇవ్వాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.

అయితే ఈ సినిమా ఆగిపోయిందని, స్క్రిప్టు నచ్చకపోవడంతో మహేష్ సుకుమార్ ను స్క్రిప్ట్ పై మరింత వర్క్ చేయమని చెప్పినట్లు ఈ మధ్యలో మహేష్ వేరే సినిమా చేయనున్నట్లు బోలెడు పుకార్లు మనం వింటూ వచ్చాం. అయితే తాజా సమాచారం ప్రకారం మహేష్, సుకుమార్ సినిమా మే నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం 'మహర్షి' సినిమాతో బిజీగా ఉన్న మహేష్ బాబు త్వరలో సినిమా పనులను పూర్తి చేసి సుకుమార్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టనున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయం పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories