Sarkaru Vaari Paata: అర్జున్‌ పాత్రపై మహేశ్ బాబు ఫ్యాన్స్‌ ఆందోళన?

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు, పరశురామ్ కాంబోలో రానున్న సినిమా ‘సర్కారు వారి పాట’.

Venkata Chari
Published on: 5 Jun 2021 6:40 PM IST
Mahesh Fans Tention about Action Hero Arjun Role In Sarkaru Vaari Paata
X

అర్జున్, మహేశ్ బాబు (ఫొటో ట్విట్టర్)

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు, పరశురామ్ కాంబోలో రానున్న సినిమా 'సర్కారు వారి పాట'. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త మహేష్ బాబు ఫ్యాన్స్‌ని ఆందోళన పెడుతోంది. ఈ సినిమాలో విలన్‌గా సీనియర్ హీరో అర్జున్ నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

కాగా, టాలీవుడ్‌లో అర్జున్ గతంలో విలన్‌గా కొన్ని సినిమాల్లో కనిపించాడు. అయితే ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్‌ దగ్గర బోల్తాపడ్డాయని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. తాజాగా నితిన్‌ 'లై' సినిమాలోనూ ప్రతినాయకుడిగా నటించాడు. ఆ సినమా కూడా నిరాశ పరిచింది. దీంతో అర్జున్‌ విలన్‌గా నటించనున్న సర్కారు వారి పాట సినిమా కూడా ఎలాంటి ఫలితాన్ని ఇవ్వనుందో అని టెన్షన్ పట్టుకుందంట.

అయితే మరికొందరు మాత్రం ఆయా సినిమాల్లో కంటెంట్ సరిగ్గా లేకపోవడమే అని, అర్జున్ నటనలో లోపం కాదని అంటున్నారు. మహేశ్ సినిమా కోసం పరశురామ్ అలాంటి తప్పు చేయడని అంటున్నారు. అర్జున్ కోసం ఓ విలక్షణమైన పాత్రను డిజైన్ చేశాడని టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమాలో అర్జున్ పాత్ర గురించి ఇంతవరకు ఎలాంటి ప్రకటన మాత్రం రాలేదు. కానీ, అప్పుడే ఇలాంటి పుకార్లు మాత్రం నెట్టింట్లో తెగ తిరుగుతున్నాయి.

కరోనాతో ప్రస్తుతం షూటింగ్ ఆగిపోయింది. తొలి షెడ్యూల్‌ని దుబాయ్‌లో పూర్తి చేశారు. రెండో షెడ్యూల్ కరోనా పరిస్థితులు చక్కబడిన తరువాత పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే మూడో షెడ్యూల్ కోసం యూరప్ వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన కీర్తి సురేశ్ నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.

Venkata Chari

Venkata Chari

Next Story