Mahesh Fans Angry on Uma Maheswara Ugra Roopasya Team : ఉమామ‌హేశ్వర ఉగ్రరూప‌స్య టీంపై మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహం!

Mahesh Fans Angry on Uma Maheswara Ugra Roopasya Team : ఉమామ‌హేశ్వర ఉగ్రరూప‌స్య టీంపై  మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహం!
x
Mahesh Babu and Uma Maheswara Ugra Roopasya Movie Poster
Highlights

Mahesh Fans Angry on Uma Maheswara Ugra Roopasya Team : నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఉమామ‌హేశ్వర ఉగ్రరూప‌స్య ..

Mahesh Fans Angry on Uma Maheswara Ugra Roopasya Team : నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఉమామ‌హేశ్వర ఉగ్రరూప‌స్య .. 'కేరాఫ్‌ కంచరపాలెం' ఫేం వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని ఆర్కా మీడియా, మహాయాన మోషన్‌ పిక్చర్స్‌ కలిసి సంయుక్తంగా నిర్మించింది. తాజాగా ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌ లో విడుదలై మంచి టాక్ ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాపైన మహేష్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో భాగంగా వచ్చే ఓ సన్నివేశంలో ఆర్టిస్ట్ సుహాస్ మహేష్ బాబును సోమరి వ్యక్తి అని పిలుస్తాడు. ఎందుకంటే ఈ చిత్రంలో సుహాస్ ఎన్టీఆర్ అభిమాని కాగా, అమ్మాయి మహేష్ బాబు అభిమాని. ఒకానొక సందర్భంలో వీరిద్దరి మధ్య కొద్దిసేపు వాదన జరుగుతుంది. ఈ సందర్భంలో, అతను మహేష్ ఒక సోమరి వ్యక్తిని అంటాడు. సినిమాలో ఇది ఫన్నీ సన్నివేశం అయినప్పటికీ మహేష్ అభిమానులు దీనిపైన తీవ్రంగా మండిపడుతున్నారు. అంతేకాకుండా మరికొందరు చిత్ర యూనిట్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

నిజానికి సినిమాలో కూడా ఈ సన్నివేశానికి పెద్దగా ప్రాముఖ్యత లేదు, కానీ దానిని మేకర్స్ అలాగే ఉంచారు. ప్రస్తుతం ఈ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పెద్ద చర్చకు దారీ తీసింది. మరి దీనిపైన చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి! ఇక మలయాళంలో మంచి హిట్ అయిన 'మహేశ్‌ ఇంటే ప్రతికారం' చిత్రాన్ని తెలుగులోకి 'ఉమామహేశ్వర ఉగ్రరూప‌స్య'గా తెరకెక్కించారు మేకర్స్.. విడుదలకి ముందే రీలిజ్ అయిన టీజర్, ట్రైలర్ అందరిని ఆకట్టుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories