Sarkaru Vaari Paata: ప్రిన్స్ ఫ్యాన్స్‌కు నిరాశ!

Sarkaru Vaari Paata: టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు నూతన సినిమా 'సర్కారు వారి పాట' పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Venkata Chari
Updated on: 27 May 2021 9:31 PM IST
Mahesh Babus team disappoints fans!
X

మహేశ్ బాబు (ఫొటో ట్విట్టర్)

Sarkaru Vaari Paata: టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు నూతన సినిమా 'సర్కారు వారి పాట' పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కాగా, ఈనెల 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సర్కారు వారి పాటపై ఓ అప్‌డేట్ రావొచ్చని ఫ్యాన్స్ ఊహించారు. అలాగే కొద్ది రోజులుగా నెట్టింటో ఇలాంటి వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కానీ, అలాంటిదేమీ లేదని మహేశ్ టీం ఫ్యాన్స్‌ ఆశలపై నీళ్లు చల్లింది.

దేశంలో ప్రస్తుత పరిస్థితి మేరకు ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ రాదని మహేశ్ టీం పేర్కొంది. ఈమేరకు ట్విట్టర్లో ఓ ప్రకటనను విడుదల చేసింది. "ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, మనలో ప్రతి ఒక్కరికి క్షేమంగా ఉండాల్సిన సమయం. అందరు ఇంట్లోనే ఉండి, కరోనా నుంచి కాపాడుకోవాల్సిన సమయమిది. ఇలాంటి పరిస్థిల్లో సర్కారు వారి పాట నుంచి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వడంలేదు. ఇది సరైన సమయం కాదని మా నమ్మకం."

"ఈ సినిమాకు సంబంధించి ఇటీవల వస్తున్న వార్తలను నమ్మకండి. ఎటువంటి అప్‌డేట్ ఉన్నా.. అధికారికంగా తెలియజేస్తాం. అప్పటి వరకు సురక్షితంగా ఉండండి." అని ట్విట్టర్లో రాసుకొచ్చారు. దీంతో ఈనెల 31న ఎటువంటి పోస్టర్లు విడుదల కావడం లేదని తెలుస్తోంది. సో.. సర్కారు వారి పాట అప్‌డేట్ కోసం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Venkata Chari

Venkata Chari

Next Story