మహేష్ బదులుగా నాని

మహేష్ బదులుగా నాని
x
Highlights

న్యాచురల్ స్టార్ నాని త్వరలో 'మనం' దర్శకుడు విక్రమ్ కె.కుమార్ తో 'గ్యాంగ్ లీడర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే...

న్యాచురల్ స్టార్ నాని త్వరలో 'మనం' దర్శకుడు విక్రమ్ కె.కుమార్ తో 'గ్యాంగ్ లీడర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే నిజానికి ఈ సినిమాలో నాని కంటే ముందు మహేష్ బాబు ని అనుకున్నారు. విక్రమ్ కుమార్ మహేష్ బాబు కి కథ కూడా వినిపించాడట. కానీ మహేష్ కు పెద్దగా నచ్చలేదు. కానీ నానికి మాత్రం స్క్రిప్ట్ బాగానే అనిపించి కొన్ని మార్పులు చేర్పులు చెప్పగా విక్రమ్ కె.కుమార్ కూడా ఆ మార్పులను చేసి కథను నాని ఇమేజ్ కు సెట్ అయ్యేలాగా మార్చాడు.

అప్పుడు నాని ఆ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. మరి ఈ కథను వద్దనుకుని మహేష్ బాబు మంచి పని చేశాడా లేదా అనే విషయం తెలియాలంటే సినిమా విడుదల అయ్యేదాకా ఎదురుచూడాల్సిందే. మరోవైపు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 'ఆర్ఎక్స్ 100' హీరో కార్తికేయ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు మహేష్ బాబు 'మహర్షి' సినిమా మే 9న విడుదల కాబోతోంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories