అంచనాలను అందుకోలేకపోయిన సర్కారు వారి పాట టైటిల్ సాంగ్

*అంచనాలను అందుకోలేకపోయిన సర్కారు వారి పాట టైటిల్ సాంగ్

Rama Rao
Updated on: 24 April 2022 5:30 PM IST
Mahesh Babus Sarkaru Vaari Paata title song
X

అంచనాలను అందుకోలేకపోయిన సర్కారు వారి పాట టైటిల్ సాంగ్

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న "సర్కారు వారి పాట" సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన "కళావతి" పాట ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. మహేష్ కూతురు సితార కనిపించిన "పెన్నీ" పాట కూడా యూట్యూబ్ లో బాగానే వైరల్ అయింది.

ఇక తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. కానీ ఈ పాటకు మాత్రం అనుకున్న స్థాయిలో ఆదరణ లభించలేదు."సర్కారు వారి పాట" టైటిల్ సాంగ్ గా విడుదలైన ఈ పాట అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది. పైగా ఈ పాటని తమన్ వేరే పాట నుంచి కాపీ కొట్టారు అంటూ మళ్లీ కామెంట్లు మొదలయ్యాయి.పాట నిడివి కూడా చాలా తక్కువగా ఉండటం, లిరిక్స్ యావరేజ్ గా ఉండటంతో అభిమానులు పాట బాగాలేదంటూ కామెంట్లు చేస్తున్నారు.

మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా లో సముద్రఖని ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. మే 12న సినిమా విడుదల అవుతుంది అని దర్శక నిర్మాతలు ప్రకటించారు కానీ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

Rama Rao

Rama Rao

Next Story