Prabhas Fauzi: ఫౌజీలో మహేష్ బాబు మేనల్లుడు.. ప్రభాస్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ..

Prabhas Fauzi: ఫౌజీలో మహేష్ బాబు మేనల్లుడు.. ప్రభాస్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ..
x
Highlights

Prabhas Fauzi: మహేశ్ బాబు మేనల్లుడు, సుధీర్ బాబు కుమారుడు దర్శన్ ఇంట్రెస్టింగ్ పాత్రలో నటిస్తున్నాడు.

Prabhas Fauzi: మహేశ్ బాబు మేనల్లుడు, సుధీర్ బాబు కుమారుడు దర్శన్ ఇంట్రెస్టింగ్ పాత్రలో నటిస్తున్నాడు. ప్రభాస్ ‘ఫౌజీ’లో జూనియర్ ప్రభాస్‌గా కనిపించనున్నాడు.

సుధీర్ బాబు కుమారుడు దర్శన్ నటనలో అడుగుపెడుతున్నాడు. అన్న చరిత్ మానస్ ‘భలే భలే మగాడివోయ్’తో ఎంట్రీ ఇచ్చాడు. దర్శన్ ‘సర్కారు వారి పాట’లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ఫౌజీ’లో నటిస్తున్నాడు.

1930 రజాకార్ల ఉద్యమం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీస్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తోంది. దర్శన్ ఇందులో ప్రభాస్ చిన్నప్పటి పాత్ర పోషిస్తాడట. సుధీర్ బాబు జటాధరా ప్రమోషన్స్ ద్వారా ఈ అప్‌డేట్ వెల్లడించాడు. తాత కృష్ణ, మేనమామ మహేశ్‌లా దర్శన్ కూడా పెద్ద హీరోగా ఎదగనున్నాడని ఘట్టమనేని అభిమానులు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories