మరో బిజినెస్ స్టార్ట్ చేస్తున్న మహేష్.. ఆ బడా గ్రూప్ తో కలిసి రంగంలోకి!

రెస్టారెంట్ బిజినెస్ లో దిగనున్న మహేష్ బాబు

Arun Chilukuri
Updated on: 2 Aug 2022 4:16 PM IST
Mahesh Babus Luxury Restaurant in Hyderabad
X

మరో బిజినెస్ స్టార్ట్ చేస్తున్న మహేష్.. ఆ బడా గ్రూప్ తో కలిసి రంగంలోకి!

Mahesh Babu Restaurant Business: ఒకవైపు సినిమాలతో మరోవైపు బ్రాండ్ ఎండార్స్మెంట్స్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు బాగానే డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే సంపాదించడం మాత్రమే కాక మహేష్ బాబు మంచి చోట్ల ఇన్వెస్ట్మెంట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. ఈ మధ్యనే ఏషియన్ గ్రూప్ వారితో కలిసి ఏఎంబి సినిమాస్ ను నిర్మించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు మహేష్ బాబు ఒక రెస్టారెంట్ బిజినెస్ ని మొదలు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

అయితే మహేష్ బాబు ఈ బిజినెస్ లో డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయరట. కేవలం రెస్టారెంట్ బిజినెస్ లో తాను కూడా భాగస్వామ్యం తీసుకోబోతున్నారట. వివరాల్లోకి వెళితే బంజారాహిల్స్ లోని ఒక పోష్ ప్రదేశంలో మహేష్ బాబుకి ఒక పెద్ద ల్యాండ్ ఉంది. ఒక పాపులర్ రెస్టారెంట్ చైన్ వారికి ఆ లాండ్ బాగా నచ్చింది. ఆ రెస్టారెంట్ కాన్సెప్ట్ మరియు ఐడియా కూడా మహేష్ బాబు కి నచ్చటంతో ఆ ల్యాండ్ లోనే ఆ రెస్టారెంట్ ని పెట్టేందుకు మహేష్ బాబు ఒప్పుకుంటునట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

దీని గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఇక సినిమాల పరంగా చూస్తే ఈ మధ్యనే "సర్కారు వారి పాట" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మహేష్ బాబు తాజాగా ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story