Athadu : అతడు రీరిలీజ్‌కు సిద్ధం.. సీక్వెల్ కూడా రాబోతోందా?

Athadu : అతడు రీరిలీజ్‌కు సిద్ధం.. సీక్వెల్ కూడా రాబోతోందా?
x

Athadu: అతడు రీరిలీజ్‌కు సిద్ధం.. సీక్వెల్ కూడా రాబోతోందా?

Highlights

Athadu: సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు పండగే. ఈ నెల 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Athadu: సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు పండగే. ఈ నెల 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎందుకంటే, మహేష్ బాబు నటించిన కల్ట్ క్లాసిక్ సినిమా అతడు మళ్లీ థియేటర్లలోకి రీరిలీజ్ అవుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, త్రిష కథానాయికగా వచ్చిన ఈ ఫ్యామిలీ డ్రామా 2005లో విడుదలై భారీ విజయం సాధించింది. ఇప్పుడు 8కే క్వాలిటీతో సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ప్రముఖ నటుడు, నిర్మాత మురళీ మోహన్ ఈ చిత్రాన్ని జయభేరీ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ స్థాయిలో నిర్మించారు. గత రెండేళ్లుగా ఈ సినిమాను మళ్లీ విడుదల చేయాలంటూ అభిమానుల నుంచి చాలా ఒత్తిడి రావడంతో ఈసారి రీరిలీజ్ చేయడానికి నిర్మాతలు నిర్ణయించుకున్నారు. అతడు సినిమాకు 8kలో తీర్చిదిద్దారు. అతడు రీరిలీజ్ కాబోతోందని వార్తలు వచ్చినప్పటి నుంచి సీక్వెల్ గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. అతడు సినిమాకు సీక్వెల్ ఆలోచన కూడా ఉన్నట్లు నిర్మాతలు చెబుతున్నారు.

అతడు సినిమా రీరిలీజ్ గురించి సోషల్ మీడియాలో భారీ ప్రచారం జరుగుతోంది. మహేష్ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులు ఈ సినిమాను ఒక ఈవెంట్ లా సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. నైజాం ఏరియాలో ఆసియన్ సునీల్ ఆధ్వర్యంలో ఈ సినిమా భారీగా విడుదల కాబోతోంది. సుదర్శన్ 35, దేవి వంటి ప్రధాన థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే హౌస్ ఫుల్ అయ్యాయి. ఓవర్సీస్‌లో కూడా బుకింగ్స్ చాలా వేగంగా జరుగుతున్నాయి. అలాగే ఏపీలో కూడా ఏరియాల వారీగా పోటీ పడి మరి భారీ ధరకు అతడు రీ రీరిలీజ్ హక్కులు కొనుగులు చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమా రీ రిలీజ్ థియేట్రికల్ రైట్స్ హక్కులు రికార్డ్ స్థాయిలో 3 కోట్లకు పైగా ధర పలికినట్టు సమాచారం.

మణిశర్మ అందించిన అద్భుతమైన సంగీతం, బ్రహ్మానందం కామెడీ సీన్స్ సినిమాకు ప్రధాన బలం. రీరిలీజ్ కల్చర్ టాలీవుడ్‌లో ఊపందుకున్న ఈ తరుణంలో అతడు సినిమా కూడా భారీ విజయం సాధించడం ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories