
KPHB కాలనీలోని కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ లో 11: 43కి పూజా కార్యక్రమాలతో మొదలైంది. మహేష్ బాబు కూతురు ఘట్టమనేని సీతార క్లాప్ కొట్టగా, నమ్రత మహేష్ కెమరా స్విచ్ ఆన్ చేశారు.
ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో భారీ హిట్ కొట్టిన మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని యువ దర్శకుడు పరుశురాం దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ రోజు లాంఛనంగా స్టార్ట్ అయింది. KPHB కాలనీలోని కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ లో 11: 43కి పూజా కార్యక్రమాలతో మొదలైంది. మహేష్ బాబు కూతురు ఘట్టమనేని సీతార క్లాప్ కొట్టగా, నమ్రత మహేష్ కెమరా స్విచ్ ఆన్ చేశారు. జనవరి మొదటివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.
ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అటు ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, మైత్రి మూవీ మేకర్స్, ఎంబీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్నాడు. మే లో సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇది మహేష్ బాబు కూడా 27 వ సినిమా కావడం విశేషం. మధి సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.
వాస్తవానికి మహేష్ బాబు తన 27వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయాల్సి ఉంది. కథ అసంపూర్తిగా ఉండడం, మహేష్ చిన్న చిన్న మార్పులు చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ ని మహేష్ పక్కన పెట్టారని సమాచారం.. దీనితో లైన్ లోకి పరుశురాం సినిమా వచ్చింది. ఈ సినిమా తర్వాత మహేష్ వంశీతో చేస్తారా లేదా అన్నది చూడాలి మరి!
MAHESH BABU - KEERTHY SURESH... Pooja ceremony of #Telugu film #SarkaruVaariPaata - starring #MaheshBabu and #KeerthySuresh - was held today... Shoot starts Jan 2021... Directed by #Parasuram... Produced by Mythri Movie Makers, GMB Entertainment and 14 Reels Plus. #SSMB27 pic.twitter.com/G828IqBKke
— taran adarsh (@taran_adarsh) November 21, 2020

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




