మహేష్ 26 గురించి ఆసక్తికరమైన వార్త

మహేష్ 26 గురించి ఆసక్తికరమైన వార్త
x
Highlights

వరుసగా 'సుప్రీమ్', 'పటాస్', 'సుప్రీమ్', 'రాజా ది గ్రేట్' అంటూ సూపర్ హిట్ ను అందుకున్న అనిల్ రావిపూడి ఈ మధ్యనే 'ఎఫ్ 2' సినిమాతో బ్లాక్ బస్టర్ ను...

వరుసగా 'సుప్రీమ్', 'పటాస్', 'సుప్రీమ్', 'రాజా ది గ్రేట్' అంటూ సూపర్ హిట్ ను అందుకున్న అనిల్ రావిపూడి ఈ మధ్యనే 'ఎఫ్ 2' సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. ఇక తాజాగా అనిల్ రావిపూడి మహేష్ తో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. 'మహర్షి' సినిమా విడుదలైన తర్వాత మహేష్-అనిల్ రావిపూడి సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది. 'ఎఫ్ 2' సినిమా ని నిర్మించిన దిల్ రాజు ఈ సినిమాని కూడా నిర్మించాల్సి ఉంది. కానీ మహేష్ బాబు అప్పటికే అనిల్ సుంకర కి మాటివ్వడంతో అనిల్ సుంకర మరియు దిల్ రాజు కలిసి ఈ సినిమా కి నిర్మాతలుగా మారారు.

కానీ తాజా సమాచారం ప్రకారం దిల్ రాజు సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన ఇంకా బయటకు రాలేదు కాని దిల్ రాజు ఈ సినిమాను నిర్మించడానికి ఆసక్తి చూపటం లేదని వార్తలు బయటకు వస్తున్నాయి. నిజానికి దిల్ రాజు సహ నిర్మాతగా వ్యవహరించడానికి ఒప్పుకున్న ఏ సినిమా నుంచి తప్పుకోలేదు. మరి ఈ సినిమా నుంచి ఎందుకు తప్పుకున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు ఏం జరుగుతుందో క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories