Mahesh Babu - Unstoppable Talk Show: బాలకృష్ణ షో కి గెస్ట్ గా మహేష్ బాబు

* ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ షోకి హాజరుకానున్న సూపర్ స్టార్

admin1
Updated on: 3 Dec 2021 3:05 PM IST
Mahesh Babu will Attend as Guest for Balakrishna Unstoppable Talk Show
X

బాలకృష్ణ షో కి గెస్ట్ గా మహేష్ బాబు

Mahesh Babu - Unstoppable Talk Show: ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ "అన్స్టాపబుల్" అనే ఒక సెలబ్రిటీ టాక్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ షోలో రెండు ఎపిసోడ్లు పూర్తయ్యాయి. అందులో మొదటి ఎపిసోడ్ కి మోహన్ బాబు మరియు మంచు కుటుంబ సభ్యులు గెస్ట్ లుగా విచ్చేయగా రెండవ ఎపిసోడ్ లో న్యాచురల్ స్టార్ నాని సందడి చేశారు. ఇక తాజాగా ఒక వారం పాటు బ్రేక్ తీసుకున్న ఈ టాక్ షో ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూడవ ఎపిసోడ్లో బ్రహ్మానందం బాలకృష్ణతో గెస్ట్ గా పాల్గొనబోతున్నారు. మరోవైపు నాలుగవ ఎపిసోడ్ కి ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి హాజరుకానున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఐదవ ఎపిసోడ్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు గెస్ట్ గా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ మహేష్ బాబు కాంబినేషన్ ఎవరు ఊహించనటువంటిది అని చెప్పుకోవచ్చు. ఈ ఎపిసోడ్ యొక్క షూటింగ్ డిసెంబర్ 4న జరగబోతోంది. మరోవైపు ఈ మధ్యనే మహేష్ బాబు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న "ఎవరు మీలో కోటీశ్వరుడు" షో కి గెస్ట్ గా విచ్చేసిన సంగతి తెలిసిందే. ఇలా బాబాయి అబ్బాయి ఇద్దరి షోలలోనూ గెస్ట్ గా ప్రేక్షకులను పలకరించాడు మహేష్ బాబు.

admin1

admin1

Next Story