Prashanth Neel: నాకు ఫస్ట్ ఫోన్ చేసింది మహేష్ బాబు

Prashanth Neel: కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరో గా నటించిన "కే జి ఎఫ్: చాప్టర్ 1" సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.

admin1
Published on: 20 April 2022 2:56 PM IST
Mahesh Babu Was The First Hero To Call Me After KGF Says Prashanth Neel
X

Prashanth Neel: నాకు ఫస్ట్ ఫోన్ చేసింది మహేష్ బాబు

Prashanth Neel: కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరో గా నటించిన "కే జి ఎఫ్: చాప్టర్ 1" సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా "కే జి ఎఫ్: చాప్టర్ 2" ఈ మధ్యనే థియేటర్లలో విడుదలైంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ గా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. "కే జి ఎఫ్" సినిమా సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు ప్రశాంతి నీల్ రాజమౌళి లాగా స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు. అయితే తాజాగా "కే జి ఎఫ్" సినిమా గురించి మొట్టమొదటిసారిగా రియాక్ట్ అయిన తెలుగు హీరో గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ప్రశాంత్ నీల్.

"కే జి ఎఫ్: చాప్టర్ 1" సినిమా విడుదలైన తర్వాత మొట్టమొదటిసారిగా మహేష్ బాబు ఇండస్ట్రీ నుంచి నాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఆ తర్వాత మహేష్ బాబుని ఒకసారి కలిశాను. ఇండస్ట్రీలో యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేసే విషయంలో మహేష్ బాబు ఎప్పుడు ముందుగానే ఉంటారు. నాకు ఆయన కల్చర్ చాలా ఇష్టం. సొంత అవసరాలకోసం కాకుండా జెన్యూన్ గా టాలెంట్ని మెచ్చుకునే మనస్తత్వం ఉన్న హీరో మహేష్ బాబు" అని చెప్పుకొచ్చారు ప్రశాంత్. ఆ తర్వాత ఎన్టీఆర్ కూడా తనకు కాల్ చేసి సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు అని అన్నారు ప్రశాంత్.

admin1

admin1

Next Story